Viral Video: అంతటి కింగ్ కోబ్రాను ఒంటిచేత్తో నిలబెట్టేసాడుగా..! వీడియో షేర్ చేసిన ఐఎఫ్‌ఎస్ ఆఫీసర్
పాములంటే సాధారణంగా ఎవరికైనా భయమే. ఆఖరికి పాములు పట్టేవారైనా కూడా ఎంతో జాగ్రత్తగా వాటిని పట్టుకుంటారు. కొందరైతే పామును తలచుకుంటేనే భయంతో వణికిపోతారు. అలాంటిది ఓ యువకుడు ఓ భారీ కింగ్ కోబ్రాను ఏమాత్రం భయం లేకుండా ఒట్టి చేతులతో పట్టుకున్న వీడియో ప్రస్తుతం...

పాములంటే సాధారణంగా ఎవరికైనా భయమే. ఆఖరికి పాములు పట్టేవారైనా కూడా ఎంతో జాగ్రత్తగా వాటిని పట్టుకుంటారు. కొందరైతే పామును తలచుకుంటేనే భయంతో వణికిపోతారు. అలాంటిది ఓ యువకుడు ఓ భారీ కింగ్ కోబ్రాను ఏమాత్రం భయం లేకుండా ఒట్టి చేతులతో పట్టుకున్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఆ పాము సైజును చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఆ దృశ్యాలు చూస్తే ఒళ్లు జలదరించక మానదు. కానీ, ఆ యువకుడి ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు.
11 సెకన్ల వీడియో క్లిప్‌ను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. “కింగ్ కోబ్రా అసలు సైజు ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఇవి భారత్‌లో ఎక్కడ కనిపిస్తాయో మీకు తెలుసా?” అంటూ క్యాప్షన్ జోడించారు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి భారీ కింగ్ కోబ్రా నడుము భాగాన్ని ఎంతో కాన్ఫిడెంట్‌గా పట్టుకుని ఉండటం స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆ పాము భారీసైజు చూసి ఒకింత ఆందోళన వ్యక్తం చేశారు. మరికొందరు దాని గంభీరమైన రూపాన్ని చూసి ఆశ్చర్యపోయారు. దాని సైజు చూస్తేనే ఒళ్లు జలదరిస్తోంది.. వాటికి దూరంగా ఉండటమే ఉత్తమం అంటూ కామెంట్లు చేశారు.
కింగ్ కోబ్రా ప్రపంచంలోనే అత్యంత పొడవైన విషపూరిత సర్పం. ఇది సుమారు 18 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది. మన దేశంలో ఇవి ప్రధానంగా పశ్చిమ, తూర్పు కనుమలతో పాటు అసోం, మేఘాలయ వంటి ఈశాన్య రాష్ట్రాల్లోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో నివసిస్తాయి. సాధారణంగా ఇవి మనుషుల జోలికి రాకుండా దూరంగా ఉంటాయని నిపుణులు చెబుతారు.
వీడియో చూడండి:
If you ever wondered about the real size of King cobra. Do you know where it is found in India. And what to do when you see one !! pic.twitter.com/UBSaeP1cgO
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) July 8, 2025
