Viral Video: ఖడ్గమృగాన్ని కౌగిలించుకున్న యువతి.. రియాక్షన్‌ ఎలా ఉందంటే..?

Viral Video: ఏనుగు తర్వాత అత్యంత శక్తివంతమైన జీవి ఖడ్గమృగం. ఒక్కోసారి ఏనుగుతో కూడా ఢీకొంటుంది. వాస్తవానికి ఖడ్గమృగం ఎవరినైనా తమ పదునైన

Viral Video: ఖడ్గమృగాన్ని కౌగిలించుకున్న యువతి.. రియాక్షన్‌ ఎలా ఉందంటే..?
Viral Video

Edited By: Phani CH

Updated on: Feb 04, 2022 | 4:40 PM

Viral Video: ఏనుగు తర్వాత అత్యంత శక్తివంతమైన జీవి ఖడ్గమృగం. ఒక్కోసారి ఏనుగుతో కూడా ఢీకొంటుంది. వాస్తవానికి ఖడ్గమృగం ఎవరినైనా తమ పదునైన కొమ్ములతో చీల్చి చెండాడుతుంది. అడవికి రాజైన సింహం కూడా ఖడ్గమృగంతో పోటీ పడాలంటే ఆలోచిస్తుంది. కానీ ఇటీవల ఒక అమ్మాయి, ఖడ్గమృగానికి సంబంధించిన ఒక వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. ఈ వీడియో చూసిన ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. వాస్తవానికి ఈ వీడియోలో ఆ అమ్మాయి ఖడ్గమృగాన్ని కౌగిలించుకొని ముద్దు పెడుతుంది. ఈ ఈ 21 సెకన్ల వీడియో అందరిని షాక్‌కి గురిచేస్తుంది.

ఈ వీడియోలో ఒక అమ్మాయి ఒక పెద్ద ఖడ్గమృగాన్ని కౌగిలించుకుని ఒక బొమ్మకి ఎలా అయితే ముద్దు పెడుతామో అదే మాదిరి ముద్దులు పెడుతుంది. ఈ సమయంలో ఖడ్గమృగం కూడా ఆమెపై ఎటువంటి దాడికి పాల్పడకపోవడం మనం గమనించవచ్చు. అమ్మాయి, ఖడ్గమృగానికి సంబంధించిన ఈ వీడియో రినోహూస్ అనే ఖాతాతో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. జనవరి 15న ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసిన ఈ వీడియోని ఇప్పటి వరకు 80 వేలమంది చూశారు. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది. వీడియోను చూసిన తర్వాత నెటిజన్లు కామెంట్ల ద్వారా వారి అభిప్రాయాన్ని తెలుపుతున్నారు.

ఒక నెటిజన్‌ ఇలా స్పందించాడు.. ‘ఈ అమ్మాయి తెలివి తెల్లారినట్లే ఉంది. ఖడ్గమృగం చెలరేగితే ఆమె పని అయిపోతుంది ‘ అన్నాడు. మరొక నెటిజన్‌ ఆశ్చర్యంతో వ్యాఖ్యానిస్తూ ‘ఈ ఖడ్గమృగం ఇప్పటివరకు ప్రశాంతంగా ఉండటం చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను’ అన్నాడు. ఇంకొకరు ‘అలాంటి అడవి జంతువులకు దూరంగా ఉండటం మంచిది’ అన్నాడు. చాలామంది అడవి జంతువులకి దూరంగా మంచిదని సూచించారు. ఏది ఏమైనప్పటికీ ఈ వీడియో సోషల్‌ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

 

UGC Chairman: యూజీసీ చైర్మన్‌గా తెలంగాణ వ్యక్తి.. ఎవరో తెలుసా..?

Beauty Tips: అందమైన పాదాల కోసం ఐదు పద్దతులు.. పార్లర్‌ అవసరమే లేదు..?

Baby Bump: ఈ మహిళ బేబీ బంప్‌ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. సోషల్‌ మీడియాలో వైరల్‌..?