Viral Video: ఎలుగుబంటి భయపడింది చూస్తే మాత్రం పొట్టచెక్కలవ్వాల్సిందే… ఒక్కసారి గుండె అగినంత పనైందిగా

మన దగ్గర సంక్రాంతికి ముగ్గుల పోటీలు, బతుకమ్మకు రంగురంగుల బతుకమ్మల పోటీల మాదిరిగానే యూరప్‌లో హాలోవీన్స్‌ పోటీలు సరదాగా సాగిపోతుంటాయి. ఒకప్పుడు యూరప్‌ కంట్రీస్‌లో మాత్రమే కనిపించే ఈ ట్రెండ్‌ ఇప్పుడు ఇతర దేశాలకు సైతం వ్యాపించింది. భారత్‌లోనే ఇటీవల రకరకాల వేషధారణలతో ఢిల్లీ వీధుల్లో...

Viral Video: ఎలుగుబంటి భయపడింది చూస్తే మాత్రం పొట్టచెక్కలవ్వాల్సిందే... ఒక్కసారి గుండె అగినంత పనైందిగా
Bear Halloween

Updated on: Nov 08, 2025 | 5:52 PM

మన దగ్గర సంక్రాంతికి ముగ్గుల పోటీలు, బతుకమ్మకు రంగురంగుల బతుకమ్మల పోటీల మాదిరిగానే యూరప్‌లో హాలోవీన్స్‌ పోటీలు సరదాగా సాగిపోతుంటాయి. ఒకప్పుడు యూరప్‌ కంట్రీస్‌లో మాత్రమే కనిపించే ఈ ట్రెండ్‌ ఇప్పుడు ఇతర దేశాలకు సైతం వ్యాపించింది. భారత్‌లోనే ఇటీవల రకరకాల వేషధారణలతో ఢిల్లీ వీధుల్లో చక్కర్లు కొట్టిన వీడియోలు సోషల్‌ మీడియలో వైరల్‌గా మారాయి.

పలు దేశాల్లో ఈ ఏడాది కూడా హాలోవీన్స్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కొంతమంది విచిత్ర వేషాధరణలో సందడి చేశారు. హాలోవీన్స్ డే రాత్రి కొందరు తమ ఇళ్ల వద్ద రిమోట్‌ కంట్రోల్డ్‌ బొమ్మలను ఏర్పాటు చేసి వినూత్నంగా సంబరాలు చేసుకున్నారు. ఆ బొమ్మలు చేసిన రచ్చ ఇప్పుడు అంతా ఇంతా కాదు. రాత్రి పూట ఇళ్ల పరిసరాల్లో తిరిగే జంతువులు హాలోవీన్స్ బొమ్మలను చూసి వాటి గండాగినంత పనయింది. నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియోలు చూసి నెటిజన్స్‌ తెగ నవ్వుకుంటున్నారు.

వీడియో చూడండి:

వైరల్ అవుతున్న వీడియోలో ఓ ఇంటి ఆవరణలో హాలోవీన్స్ రూపంలో ఉన్న రిమోట్ కంట్రోల్డ్ బొమ్మ కనపడుతుంది. రాత్రి ఆ ఇంటి ఆవరణలోకి భారీ ఎలుగుబంటి వస్తుండటం చూడొచ్చు. సరిగ్గా ఆ బొమ్మ వద్దకు వచ్చి నిల్చోవడం కనిపిస్తుంది. ఆ బొమ్మ మనిషి మాదిరిగా నిల్చుని ఉండటంతో ఎలుగుబంటి వాసన పడిగడుతూ ఉంటుంది. ఇంతలో బొమ్మకు లైట్ వెలిగి గట్టిగా శబ్ధం రావడం కనిపించింది. వెంటనే భయపడిన ఎలుగుబంటి షాక్‌తో వెల్లకిలా పడిపోవడం వీడియోలో కనిపిస్తుంది. కాసేపటికి తేరుకున్న ఎలుగుబంటి ఓర్నీ ఇది బొమ్మనా అని పక్కకు నెట్టడం చూడొచ్చు.

ఈ సీన్ అంతా ఇంటి ఆవరణలో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ కావడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఎలుగుబంటి భయపడిన తీరు చూసి నెటిజన్లు పొట్టచెక్కలయ్యేలా ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ వీడియోపై నెటిజన్స్‌ ఫన్నీ కామెంట్స్‌ పెడుతున్నారు. అయితే కొంతమంది నెటిజన్స్‌ మాత్రం ఇది ఏఐ క్రియేటివ్‌ అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.