Viral Video: థ్రిల్ కోసం ఏరో 360 రైడర్ ఎక్కితే.. తలకిందులుగా ఉండి.. రైడర్స్‌కు పట్టపగలే చుక్కలు చూపించిందిగా

|

Jun 03, 2022 | 6:18 PM

Viral Video: ఎయిరో 360 రైడ్ పైభాగంలో ఇరుక్కుపోయి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన ఘటన కెన్నీవుడ్ అమ్యూజ్‌మెంట్ పార్కులో సోమవారం చోటుచేసుకుంది.

Viral Video: థ్రిల్ కోసం ఏరో 360  రైడర్ ఎక్కితే.. తలకిందులుగా ఉండి.. రైడర్స్‌కు పట్టపగలే చుక్కలు చూపించిందిగా
Viral Video
Follow us on

Viral Video: యుఎస్‌లోని పెన్సిల్వేనియాలోని థ్రిల్లింగ్ పార్క్ లో థ్రిల్ కోరుకునేవారు రైడ్‌ చేస్తున్న సమయంలో జరిగిన  తప్పుతో రైడర్ మధ్యలో ఆగిపోయి తలక్రిందులుగా వేలాడారు. ఎయిరో 360 రైడ్ పైభాగంలో ఇరుక్కుపోయి ప్రజలు  భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటన కెన్నైవుడ్ అమ్యూజ్మెంట్ పార్కులో సోమవారం చోటుచేసుకుంది. ఆ క్షణం వీడియోలో ఈ దృశ్యాలు చిత్రీకరించబడింది. అనంతరం ఈ వీడియో యూట్యూబ్‌లో షేర్ చేశారు. ఈ వీడియో క్లిప్‌లో, ఏరో 360 రైడ్ .. ఎత్తైన ప్రదేశంలో చిక్కుకుపోయింది. దీంతో ఆ రైడర్ లో ఉన్న రైడర్‌లు చిక్కుకున్నారు.  అమ్యూజ్మెంట్ పార్కు వెబ్‌సైట్ ప్రకారం.. ఏరో 360  రైడర్ .. 360-డిగ్రీల ఓవర్-ది-టాప్ అనుభవంతో ముగుస్తుంది. ఇందులో థ్రిల్లింగ్ అనుభవం పొందాలనుకునేవారు రైడర్‌లు 360 ని ఎక్కి ఎంజాయ్ చేస్తారు. అయితే సోమవారం ఇందులో ఎక్కిన వారు రెగ్యులర్ గా అనుభవించే వారికంటే కొంచెం ఎక్కువసేపు  ఆ రైడర్ లో ఉన్నారు.

థ్రిల్ కోరుకునేవారిలో ఒకరైన అలెగ్జాండ్ర ష్నైడర్.. ఆ రోజు ఏరో 360లో తన అనుభవాన్ని పంచుకున్నారు. దీనిలో చిక్కుకోవడం ఒక అనుభవాన్ని ఇచ్చినట్లు భావిస్తున్నట్లు చెప్పారు. తలకిందులుగా ఇరుక్కుపోవడంతో..  తలలోకి రక్తం చేరుకొని..  తనకు తలనొప్పి వచ్చిందని ష్నీడర్ చెప్పారు. “మేము.. వాస్తవానికి తాము ఇలా ఇరుక్కుపోవడం ఒక చెత్త అనుభవమని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ష్నీడర్ తాను ఎక్కిన రైడర్ తలకిందులుగా ఐదు నిమిషాల కంటే ఎక్కువసేపు నిలిచిపోయిందని చెప్పారు. అయితే ఇది చాలామంది జోక్ గా తీసుకుంటున్నారు.. కానీ ఆ భయంకరమైన అనుభవం గురించి ఒక్కసారి ఆలోచిస్తే తెలుస్తుంది అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సంఘటన అనంతరం…  పార్క్ జనరల్ మేనేజర్ మార్క్ పాల్స్ మాట్లాడుతూ.. రైడ్ సరిగా పని చేయకపోవడంతో నిర్వహణ సిబ్బంది దానిని తిరిగి విశ్రాంతి స్థానానికి” తీసుకువచ్చారని తెలిపారు. రైడర్లకు  పార్క సిబ్బంది ప్రథమ  చికిత్స  చేశారని తెలిపారు. రైడర్లలో ముగ్గురు తీవ్రంగా భయాందోళనకు గురయ్యారని.. వారికి ప్రథమ చికిత్స కేంద్రంలో చికిత్స అందించారని.. అనంతరం పార్క్ నుంచి క్షేమంగా వెళ్లిపోయారని తెలిపారు. ప్రస్తుతం రైడ్ పనితీరుని సమీక్షిస్తున్నామని మరికొన్ని రోజుల పాటు ఏరో 360 మూసివేయబడుతుందని పాల్స్ తెలియజేసారు. తమ పార్క్ లో సందర్శకుల “భద్రతే మొదటి ప్రాధాన్యత,” అని పేర్కొన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..