Two-Headed Snake: గతంలో ఎప్పుడూ చూడని అత్యంత అరుదైన రెండు తలల పాము.. పక్షి గుడ్లను మాత్రమే తింటుంది..!

|

Jul 01, 2022 | 4:47 PM

మరికొన్నిసార్లు వీటి తలలు ఒకదానిపై మరొకటి ఉంటుంది. ఇలాంటి పాము ఎక్కువ కాలం జీవించదు. ఇది ఎటు వెళ్లినా చాలా నెమ్మదిగా కదులుతుందన్నారు. ఇలాంటి పాములు కేవలం..

Two-Headed Snake: గతంలో ఎప్పుడూ చూడని అత్యంత అరుదైన రెండు తలల పాము.. పక్షి గుడ్లను మాత్రమే తింటుంది..!
Two Headed Snake
Follow us on

Two-Headed Snake: ప్రకృతిలో చాలా భాగం ఇప్పటికీ మనకు తెలియదు. చూడాల్సింది చాలా ఉంది.  ఈ భూమ్మీద మనకు తెలియిని ఎన్నో జాతుల జీవులు ఉన్నాయి. అవి పరిశోధనల్లో అప్పుడప్పుడు బయటపడుతుంటాయి. అలాంటిదే  దక్షిణాఫ్రికాలో ఓ ఆశ్చర్యకరమైన జీవి ఇటీవల కనుగొనబడింది. దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ జీవికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు తాజాగా నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఆ ఫోటోలు చూస్తుంటే ఒళ్లు  గగుర్పొడిచే విధంగా ఉన్నాయి. అందులో అత్యంత అరుదైన రెండు తలల పాము భయందోళనకు గురిచేస్తోంది. అత్యంత అరుదైన రెండు తలల పాము దక్షిణాఫ్రికాలోని అడవిలో కనబడింది. ఈ పాము మనం సాధారణంగా చూసే రెండు తలల పాము లాంటిది కాదు. మాములుగా రెండు తలల పాముకు.. రెండు చివరలా తలలు ఉంటాయి. కానీ ఈ పాముకు మాత్రం ఒకే సైడ్ రెండు తలలు ఉండటం విశేషం. ఇలాంటివి రెండు పాములను రక్షించారు అక్కడి అధికారులు.

స్నేక్ రక్షకుడు నిక్ ఎవాన్స్ రెండు తలల పాముకు సంబందించిన పోటోలను తన ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశాడు. ‘ఈ పామును చూడటం చాలా వింతగా అనిపించింది. ఇది చాలా పొడవుగా ఉంది. ఈ పాము కదిలికలు చూడటం చాలా ఆసక్తికరంగా అనిపించింది. కొన్నిసార్లు రెండు తలలు ఒకదానికొకటి వ్యతిరేక దిశలలో వెళ్ళడానికి ప్రయత్నిస్తాయి. మరికొన్నిసార్లు తలలు ఒకదానిపై మరొకటి ఉంటుంది. ఇలాంటి పాము ఎక్కువ కాలం జీవించదు. ఇది ఎటు వెళ్లినా చాలా నెమ్మదిగా కదులుతుందన్నారు. ఇలాంటి పాములు కేవలం పక్షి గుడ్లను మాత్రమే తింటాయని చెప్పారు. నిక్‌ ఎవాన్స్‌ షేర్‌ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫొటోస్ చుసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. భిన్నమైన కామెంట్లు, లైకులు కురిపిస్తున్నారు. ‘ఇలాంటి రెండు తలల పామును ఎప్పుడూ చూడలేదు’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘అత్యంత అరుదైన రెండు తలల పాము’ అని ఇంకొందరు కామెంట్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి