Wedding: ఇది జేసీబీ యుగం..! ఇదే ట్రెండ్‌ ఫాలో అవుతున్న వధూవరులు..

పెళ్లిలో అనేక తంతులు నిర్వహిస్తారు. ఇంటి ముందు వేసే పందిరి మొదలు..పెళ్లి అంటే.. పదహారు రోజుల పండగలా ఉంటుంది. ప్రస్తుతం పెళ్లిళ్లు అంతలా సాగటం లేదనుకోండి.. అయితే, ఈ పెళ్లి తతంగంలో.. వధువు వీడ్కోలు చాలా ప్రత్యేకమైనది. అందుకే ప్రజలు ఈ క్షణాన్ని ఎంతో మధురంగా, మనసుకు గుర్తుండిపోయేలా చేయాలని కోరుకుంటారు. అందుకే వధూవరుల బరాత్‌కు అంత ప్రత్యేకత ఉంటుంది.

Wedding: ఇది జేసీబీ యుగం..! ఇదే ట్రెండ్‌ ఫాలో అవుతున్న వధూవరులు..
Wedding
Follow us

|

Updated on: Jun 17, 2023 | 12:14 PM

ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం వివాహం.. పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులు, రెండు కుటుంబాలను ఒక్కటి చేసే ఒక గొప్ప సంకల్పం. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రీతిలో వివాహ వేడుక జరుగుతుంది. ఆయా ప్రాంతాలను బట్టి వారి వారి ఆచార సంప్రాదాయాలను పాటిస్తూ పెళ్లి నిర్వహిస్తారు. అయితే, ఈ పెళ్లిలో అనేక తంతులు నిర్వహిస్తారు. ఇంటి ముందు వేసే పందిరి మొదలు..పెళ్లి అంటే.. పదహారు రోజుల పండగలా ఉంటుంది. ప్రస్తుతం పెళ్లిళ్లు అంతలా సాగటం లేదనుకోండి.. అయితే, ఈ పెళ్లి తతంగంలో.. వధువు వీడ్కోలు చాలా ప్రత్యేకమైనది. అందుకే ప్రజలు ఈ క్షణాన్ని ఎంతో మధురంగా, మనసుకు గుర్తుండిపోయేలా చేయాలని కోరుకుంటారు. అందుకే వధూవరుల బరాత్‌కు అంత ప్రత్యేకత ఉంటుంది.

ఒకప్పుడు వధువు తన అత్తమామల ఇంటికి పల్లకీ/డోలిలో వెళ్లేది. ఇప్పుడు డోలీ అనేది గతానికి సంబంధించిన అంశంగా మారింది. సాధారణ కారు నుండి లగ్జరీ కార్ల యుగం వచ్చేసింది. కొంతమంది హెలికాప్టర్‌లో వెళితే.. మరికొందరు వెరైటీగాట్రాక్టర్లు, ఎడ్ల బండ్లలో కూడా పెళ్లికూతురును తీసుకువస్తారు. అయితే పెళ్లికూతురిని జేసీబీలో కూర్చోబెట్టి తన ఇంటికి తీసుకొచ్చిన వరుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక నిమిషం 13 సెకన్ల నిడివి గల ఈ క్లిప్‌లో వధూవరులు పూలతో అలంకరించిన జేసీబీపై వెళ్తున్న దృశ్యాన్ని చూడవచ్చు. ఈ ఊరేగింపు జూన్ 13న జరిగింది. వరుడి ఇంటికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వధువు ఇంటికి జేసీబీలో చేరుకుందని తెలిసింది. పూలతో అలంకరించిన జేసీబీని చూసిన జనం అవాక్కయ్యారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను @Akshara117 ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. తెలిసిన సమాచారం మేరకు..రాంచీలోని తాటిసిల్వే గ్రామానికి చెందిన కృష్ణ మహ వధువును ప్రత్యేకంగా తీసుకురావాలన్నారు. అందుకే కారుకు బదులు జేసీబీని ఎంచుకున్నాడు. జేసీబీని పూలతో అలంకరించి, తన వధువు (ఆర్తి) తీసుకోవడానికి చత్ర బస్తీకి చేరుకున్నాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం  క్లిక్ చేయండి..