AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: గూగుల్‌ మ్యాప్స్‌ను నమ్ముకుంటే ఎంత పనైపాయె… ఇంకా నయం..ఇంకాస్త అయితే..

క పోలిష్ పర్యాటకురాలు వెనిస్ కాలువలో ఊహించని విధంగా పడిపోతున్నట్లు చూపించే వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఇటాలియన్ నగరంలో గూగుల్‌ మ్యాప్స్‌ విశ్వసనీయత గురించి మరోసారి చర్చకు దారితీసింది. 19.1 మిలియన్ల వీక్షణలతో ఉన్న ఈ వీడియోలో...

Viral Video: గూగుల్‌ మ్యాప్స్‌ను నమ్ముకుంటే ఎంత పనైపాయె... ఇంకా నయం..ఇంకాస్త అయితే..
Google Map Mistake
K Sammaiah
|

Updated on: Oct 15, 2025 | 4:06 PM

Share

ఒక పోలిష్ పర్యాటకురాలు వెనిస్ కాలువలో ఊహించని విధంగా పడిపోతున్నట్లు చూపించే వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఇటాలియన్ నగరంలో గూగుల్‌ మ్యాప్స్‌ విశ్వసనీయత గురించి మరోసారి చర్చకు దారితీసింది. 19.1 మిలియన్ల వీక్షణలతో ఉన్న ఈ వీడియోలో విక్టోరియా గుజెండా తన ఫోన్‌కు అతుక్కుపోయి మెట్లు దిగి నడుస్తూండగా అకస్మాత్తుగా బ్యాలెన్స్ కోల్పోయి కాలువలోకి దూసుకెళ్లినట్లు చూపిస్తుంది. ప్రమాదం తర్వాత ఆమె కాలు చిట్లినట్లు వీడియోలో చూపిస్తుంది.

ఈ వీడియోను చూసిన చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు చలించారు. కొందరు ఈ సంఘటనను ఎగతాళి చేయగా, మరికొందరు వెనిస్‌లోని రహదారుల్లో పర్యాటకులను మ్యాపింగ్ సేవ తరచుగా తప్పుదారి పట్టిస్తుందని విమర్శించారు.

వీడియో చూడండి:

ఆమె నీటి మీద నడవాలనుకున్నారా? మరికొందరు పోస్టు పెట్టారు. “మ్యాప్స్ ఆమెను కాలువలోకి ఎలా నడిపించి జారిపడిందో ఆమె జోక్ చేయడానికి ప్రయత్నిస్తోంది. అంతే,” మరికొందరు సందేహం వ్యక్తపరిచారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యేందుకు ఉద్దేశపూర్వకంగా చేసినట్లు ఉందని ఇక నెటిజన్‌ అన్నాడు.

వెనిస్‌లో నావిగేట్ చేయడానికి గూగుల్ మ్యాప్స్ అత్యంత నమ్మదగిన సాధనం కాదని ప్రయాణికులు చాలా కాలంగా హెచ్చరిస్తున్నారు. అసాధారణ వీధి సంఖ్యలతో నగరాన్ని ఆరు జోన్లుగా విభజించారు. ఇది అనుభవజ్ఞులైన ప్రయాణికులకు కూడా చాలా క్లిష్టంగా మారిందని అంటున్నారు.

ప్రతి రోడ్డు డెడ్‌ ఎండ్‌కు కాలువలు, వీధుల్లో ఇరుకైన సందులు, మ్యాప్‌లు సూచించిన చోట కనెక్ట్ కాని వంతెనలు. హెచ్చుతగ్గుల నీటి మట్టాలు అకస్మాత్తుగా కొన్ని మార్గాలను అగమ్యగోచరంగా చేస్తాయి. “Google Maps తరచుగా పర్యాటకులను కాలువల్లో పడేస్తుంటుంది. ఫలితంగా, అనేక ట్రావెల్ వెబ్‌సైట్‌లు సాంప్రదాయ కాగితపు మ్యాప్‌లు, స్థానిక టూర్ గైడ్‌లు లేదా వెనిస్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన నావిగేషన్ యాప్‌లను ఉపయోగించమని సిఫార్సు చేస్తున్నాయి.