Viral Video: వావ్..చాచా టాలెంట్ మామూలుగా లేదుగా… అచ్చం అమ్మాయిలెక్కనే అదరగొట్టాడు
సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చాక రకరకాల వీడియోలు అర చేతిలో దర్శనమిస్తున్నాయి. వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్‌గా ఉంటే మరికొన్ని ఫన్నీగా ఉంటాయి. నెటిజన్స్ తమ టాలెంట్‌ని ప్రదర్శించుకోవడానికి సోషల్ మీడియాను ఒక వేదికగా మల్చుకుంటున్నారు. ఎలాగైనా ఫేమస్ అయిపోవాలని రకరకాలుగా...

సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చాక రకరకాల వీడియోలు అర చేతిలో దర్శనమిస్తున్నాయి. వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్‌గా ఉంటే మరికొన్ని ఫన్నీగా ఉంటాయి. నెటిజన్స్ తమ టాలెంట్‌ని ప్రదర్శించుకోవడానికి సోషల్ మీడియాను ఒక వేదికగా మల్చుకుంటున్నారు. ఎలాగైనా ఫేమస్ అయిపోవాలని రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. కొందరు డేంజరస్ స్టంట్స్ వేసి ఆకట్టుకుంటే మరికొందరు తమ లోని కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. అలాంటి ఓ వీడియోనే ఇప్పుడు నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటుంది.
వైరల్ వీడియోలో ఒక ముస్లిం వ్యక్తి తన అద్భుతమైన డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌తో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటున్నాడు. ఈ వీడియో చూస్తే మీరు ఖచ్చితంగా ఆ వ్యక్తిని ప్రశంసిస్తారు. అతని ముఖంలో ఎటువంటి సంకోచం లేదా సిగ్గు లేదు. ముఖంలో నాట్యకళ, ఆనందం మాత్రమే ఉన్నాయి. అందుకే ఈ వీడియో ప్రజల హృదయాలను తాకుతోంది.
వీడియో చూడండి:
View this post on Instagram
ఈ వీడియోలో పాట ప్లే అవ్వడం ప్రారంభించగానే చాచా నడుము ఊపడం మీరు చూడవచ్చు. అతని ప్రతి కదలిక అద్భుతంగా ఉంటుంది పాట బీట్‌లకు అనుగుణంగా ఉంటుంది. కొన్నిసార్లు అతను తన అడుగులు మారుస్తాడు, కొన్నిసార్లు అతను తన చేతి కదలికలతో వ్యక్తపరుస్తాడు. అతని ఉత్సాహం, శక్తి నెటిజన్లను ఆశ్చర్యపరిచేలా చేస్తుంది. చాచా నృత్యం చాలా ఆకర్షణీయంగా ఉంది. తాము కూడా ఇలా చేయలేమంటూ అమ్మాయిలు స్పందిస్తున్నారు.
వీడియో వైరల్ అయిన తర్వాత వేలాది మంది సోషల్ మీడియాలో అతన్ని ప్రశంసిస్తున్నారు.దీనిని ఇప్పటివరకు 2 మిలియన్లకు పైగా వీక్షించారు, 38 వేలకు పైగా ప్రజలు ఈ వీడియోను లైక్ చేసి, కామెంట్స్ పెట్టారు.
“అతని ముందు అమ్మాయిలు కూడా విఫలమవుతారు” అని నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు. బాలీవుడ్ అలాంటి ప్రతిభావంతులైన వ్యక్తులకు అవకాశాలు ఇవ్వాలని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
