Viral Video: గడ్డకట్టిన జలపాతం కింద ఆడుకుంటున్న ప్రజలు.. అకస్మాత్తుగా ఏం జరిగిందంటే..

|

Jan 07, 2025 | 4:38 PM

కొంత మంది ప్రజలు గడ్డ కట్టిన జలపాతం కింద నిలబడి ఉన్నారు. అయితే ఇంతలో అకస్మాత్తుగా వారిపై భారీగా మంచు కురిసింది. చూస్తే గూస్‌బంప్స్ ఇస్తున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వెంట్రుకలు నిక్కబోడిచేలా చేసిన ఈ సంఘటన జనవరి 5 న చైనాలోని జియాన్, షాంగ్సీ, హిషాంచ జలపాతం దగ్గర జరిగింది. ఘనీభవించిన జలపాతం కింద సరదాగా గడుపుతున్న పర్యాటకులపై అకస్మాత్తుగా భారీ మంచు పడింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు భయపడ్డారు.

Viral Video: గడ్డకట్టిన జలపాతం కింద ఆడుకుంటున్న ప్రజలు.. అకస్మాత్తుగా ఏం జరిగిందంటే..
Viral Video
Image Credit source: Instagram/@livingchina
Follow us on

సోషల్ మీడియాలో ఒక వీడియో ఎక్కువగా వైరల్ అవుతోంది. ఇది చూసిన వారికి వెంటుకలు నిక్కబోడుస్తున్నాయి. ఇందులో చాలా మంది గడ్డకట్టిన జలపాతం కింద మంచులో నిలబడి సరదాగా ఆడుకుంటూ గడుపుతున్నారు. మరుక్షణంలోనే అక్కడ ఘోర ప్రమాదం జరిగింది. సంతోషం, ఆనందగా ఉన్న వాతావరణంలో ఒక్కసారిగా అరుపులు చోటు చేసుకున్నాయి. బీభత్స వాతావరణం నెలకొంది. ఈ వీడియో చైనాకు చెందినది. ఈ హృదయ విదారక సంఘటన జనవరి 5న షాంగ్సీలోని జియాన్‌లోని హేషాంచా జలపాతం వద్ద జరిగింది.

ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఒక్కసారిగా కేకలు వేయడం వీడియో వైరల్‌గా మారింది. తమ ప్రాణాలను కాపాడుకునేందుకు పర్యాటకులు వెంటనే పరుగులు తీశారు. అయితే వారిలో ఒకరికి మంచు తగలడంతో గాయాలయ్యాయి. ఈ ప్రమాదం తర్వాత స్థానిక యంత్రాంగం ముందుజాగ్రత్త చర్యగా ఈ ప్రాంతంలో పర్యాటకుల రాకపోకలపై నిషేధం విధించింది.

ఇవి కూడా చదవండి

ఒక టన్ను బరువున్న మంచు పర్యాటకులపై పడింది, వీడియో చూడండి

ఇన్‌స్టాగ్రామ్‌లో @లివింగ్‌చినా అనే పేజీలో ఈ వీడియోను షేర్ చేశారు. ఈ రకమైన మంచుతో కూడిన జలపాతం చాలా ప్రమాదకరమని వినియోగదారు ఈ వీడియోకు ఒక కామెంట్ ను జత చేశారు. అటువంటి ప్రదేశాలలో పర్యటించే వారు సురక్షితమైన దూరాన్ని పాటించాలి. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఒకరు ప్రజలు పిల్లలతో అలాంటి ప్రదేశాలకు ఎందుకు వెళతారు అంటూ కామెంట్ చేశారు. ఇందులో పాలనా యంత్రాంగం తప్పు లేదన్నారు ఒకరు. మరికొంత మంది మంచు కింద చిక్కుకున్నట్లు భావిస్తున్నాను అని వ్యాఖ్యానించారు. మరొకరు ఇంతటి భయంకరమైన ప్రమాదంలో ఎవరికీ ఏమీ జరగనందుకు మనం దేవునికి ధన్యవాదాలు చెప్పాలన్నారు. అయితే 6 సంవత్సరాల క్రితం కూడా ఇలాంటి ప్రమాదం జరిగింది. 2019లో స్నో ఫాల్స్‌లో ఇలాంటి ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. అప్పుడు తొమ్మిది మంది గాయపడ్డారని గుర్తు చేసుకున్నారు.

 

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..