పాన్ షాప్ యజమాని.. రెండు కోట్లు విలువ జేసే బంగారు నగలు ధరించి మరీ కిళ్లీలు అమ్మకం..

|

Apr 27, 2024 | 3:10 PM

పాన్ షాప్ నడుపుతున్న వ్యక్తిని చూసినప్పుడు చిన్న పాన్ షాప్ నడుపుతున్నాడు ఇతను చదువుకున్నాడా లేక చదివిన చదువు అంతా వృధా అవుతుందా అని కూడా ఆలోచిస్తారు. అయితే ఇప్పుడు ఓ పాన్ దుకాణం యజమానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. ఈ పాన్ షాప్ యజమాని విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. చిన్న పాన్ షాప్ నడుపుతున్న ఈ వ్యక్తి శరీరంపై 2 కోట్లకు పైగా విలువ జేసే బంగారు నగలు ఉన్నాయి.

పాన్ షాప్ యజమాని.. రెండు కోట్లు విలువ జేసే బంగారు నగలు ధరించి మరీ కిళ్లీలు అమ్మకం..
Paan Seller In Bikaner
Follow us on

ఏ ఉద్యోగం లేకపోతే పాన్ షాప్ పెట్టుకుని బతికేస్తా అని అంటారు. రోడ్డు పక్కన చిన్న బడ్డీ షాప్ లో తమలపాకులను కిళ్లీలుగా చుడుతూ జీవిస్తారు. షాప్ ను నడిపే వ్యక్తిని.. అతని కుటుంబాన్ని చూసి అయ్యో పాపం.. ఎంత కష్టం .. ఎంత సంపాదిస్తే.. వీరు కనీస అవసరాలను తీర్చుకుంటూ జీవిస్తారు అని ఆలోచిస్తారు కూడా. అంతేకాదు పాన్ షాప్ నడుపుతున్న వ్యక్తిని చూసినప్పుడు చిన్న పాన్ షాప్ నడుపుతున్నాడు ఇతను చదువుకున్నాడా లేక చదివిన చదువు అంతా వృధా అవుతుందా అని కూడా ఆలోచిస్తారు. అయితే ఇప్పుడు ఓ పాన్ దుకాణం యజమానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. ఈ పాన్ షాప్ యజమాని విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. చిన్న పాన్ షాప్ నడుపుతున్న ఈ వ్యక్తి శరీరంపై 2 కోట్లకు పైగా విలువ జేసే బంగారు నగలు ఉన్నాయి.

పాన్ దుకాణం నడపడం వంశపారంపర్యంగా వస్తున్న కుటుంబంలో జన్మించిన ఫూల్‌చంద్ చాలా ఏళ్లుగా ఈ  పాన్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. ఫూల్‌చంద్ తండ్రి ఇంతకు ముందు ఈ దుకాణం నడిపేవాడు. తండ్రి నుంచి వారసత్వంగా ఈ దుఃఖాన్ని తీసుకున్న ఫూల్‌చంద్ మహిళలు ధరించే నగల కంటే ఎక్కువగా బంగారు నగలు ధరిస్తాడు. మెడలో నెక్లెస్‌లు, ఉంగరాలు,  చెవిపోగులతో సహా సుమారు 2 కిలోల బరువున్న నగలను ధరించి పాన్ ను కట్టి అమ్ముతున్నాడు.

ఇవి కూడా చదవండి

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

ప్రస్తుతం ఈ పాన్ షాపు యజమాని విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో @burning_spices ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.  ఏప్రిల్ 18న షేర్ చేసిన ఈ వీడియోకి ఇప్పటివరకు 20 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..