Viral Video: బిక్షాటన చేస్తుంటే మతిస్థిమితం లేదనుకున్నారు.. కానీ ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది.. షాకింగ్ వీడియో మీకోసం..

Viral Video: కళ్లకు కనిపించేది ఏదీ వాస్తవం కాదని అంటుంటారు. ముఖ్యంగా.. వ్యక్తుల మొహాన్ని, ధరించిన దుస్తులును బట్టి వారేంటో నిర్ణయించడం తగదంటారు.

Viral Video: బిక్షాటన చేస్తుంటే మతిస్థిమితం లేదనుకున్నారు.. కానీ ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది.. షాకింగ్ వీడియో మీకోసం..
English


Viral Video: కళ్లకు కనిపించేది ఏదీ వాస్తవం కాదని అంటుంటారు. ముఖ్యంగా.. వ్యక్తుల మొహాన్ని, ధరించిన దుస్తులును బట్టి వారేంటో నిర్ణయించడం తగదంటారు. ఎవరిలో ఏ ప్రతిభ దాగుందో ఎవరికీ తెలియదు. సందర్భం వచ్చినప్పుడు ఆటోమాటిక్‌గా అది బయటపడుతుంది. తాజాగా అలాంటి ఒక ఘటనే వెలుగు చూసింది. ఆమె భిక్షాటన చేస్తూ బతుకు వెళ్లదీస్తున్నప్పటికీ.. ఆమెలో టాలెంట్ చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే. ఎందుకంటే.. ఆమె ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడిన విధానం అలాంటిది మరి. ఈ మహిళకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.

వివరాల్లోకెళితే.. బెంగళూరుకు చెందిన స్వాతి.. కంప్యూటర్‌ సైన్స్‌లో పట్టుభద్రురాలు. అయితే, అనారోగ్యం కారణంగా కుడి చేయి పూర్తిగా చచ్చుబడిపోయింది. కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. దాంతో కడుపు నింపుకోవడానికి భిక్షాటన చేస్తోంది. వారణాసిలోని అస్సీ ఘాట్, బనారస్‌ ఘాట్ సమీపాల్లో సంచరిస్తూ భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. అయితే, ఒక హోటల్ వద్ద తినడానికి వచ్చిన స్వాతి.. పలువురు పలకరించారు. ఆ సందర్భంగా ఆమె ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె ఇంగ్లీష్‌లో మాట్లాడుతుండగా.. కొందరు వీడియో తీశారు. ఆ వీడియోను శారదా అవనీష్ త్రిపాఠి అనే ఫేస్‌బుక్ యూజర్.. తన అకౌంట్‌లో షేర్ చేశారు. దాంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది.

స్వాతి టాలెంట్ చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. అయితే, వైరల్ అవుతున్న ఈ వీడియోలో స్వాతి ఏమందంటే.. ‘అందరూ నన్ను చూసి మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నానని అనుకుంటున్నారు. అలాంటిదేమీ లేదు. కంప్యూటర్‌పై మంచి పరిజ్ఞానం ఉంది. తనకు ఉద్యోగం కావాలని కోరుకుంటున్నాను. నా జీవితాన్ని మెరుగు పరుచుకోవాలని భావిస్తున్నాను.’ అని స్వాతి తన అభిమతాన్ని చెప్పుకొచ్చింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆమె పరిస్థితి ఎందుకలా అయ్యిందంటూ కొంత బాధ వ్యక్తం చేస్తూనే.. ఆమెకు మంచి జరగాలని ఆశీర్వదిస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 50 వేలకు పైగా నెటిజన్లు వీక్షించారు.

ఇదిలాఉంటే.. అంతకు ముందు కూడా బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఒక అమ్మాయి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియోలో ఉన్న అమ్మాయి కూడా అనర్గళంగా ఇంగ్లీష్‌లో మాట్లాడుతోంది. ఇది విని నెటిజన్లు ఉలక్కిపడుతున్నారు. ఏం టాలెంట్‌రా బాబూ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియో రాజస్థాన్‌కు చెందిన ఆర్తి దిగా తెలుస్తోంది.

Also read:

Puneet Rajkumar: నాటు నాటు పాటకు పునీత్ స్టెప్పులు.. నెట్టింట్లో వైరల్‌గా ‘అప్పు’ ఫ్యాన్‌ మేడ్‌ వీడియో..

Vijayashanthi: చెల్లాచెదురైన జీవితాలు త్వరితగతిన గాడిన పడాలి.. భారీ వర్షాలపై విజయశాంతి ట్వీట్

Suryakantham: తపాలా కవరుపై గయ్యాళి అత్త ముద్ర.. వీడియో

Click on your DTH Provider to Add TV9 Telugu