మృత్యులు ఎప్పుడు ఎలా ఏ వైపు నుంచి దూసుకువస్తుందో ఎవరూ ఊహించలేరు. అప్పటి వరకు నవ్వుతూ సంతోషంగా గడిపిన వారు కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోతుంటారు. ఇలాంటి ఘటనలో మనం చాలానే చూశాం. ఇక రోడ్డు ప్రమాదాల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మనం మంచిగానే డ్రైవ్ చేస్తున్నా.. అవతలి నుంచి ప్రమాదం ఏ రూపంలో పొంచుకొస్తుందో ఊహించలేం. ఇందుకు నిదర్శనమైన వీడియో ఒక సోషల్ మీడియాలో సెన్షేషనల్‌గా మారింది.
రైల్వే ట్రాక్ వద్ద ఆగిన ఎస్‌యూవీ కారును వెనుక నుంచి యమబటులు తోసినట్లు ట్రక్కు ఢీకొనగా.. ఆరగించేందుకు మృత్యువు ఆరాటపడినట్లు ట్రాక్‌పై రైలు దూసుకొచ్చింది. కానీ, వారి టైమ్ బాగుంది. ఆ దేవుడే వారిని కాపాడాడు. రెప్పపాటులో వారి కారు ప్రమాదం నుంచి బయటపడింది. రైలు సమీపించగానే.. కారు స్టార్ట్ అయ్యింది. సెకన్ వ్యవధి కూడా లేని గ్యాప్‌లో వారు బయటపడ్డారు. దాంతో అంతా సేఫ్ అయ్యారు.
ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రైలు ట్రాక్ క్రాసింగ్ వద్ద గేట్ పడటంతో ఒక SUV కారు ఆగింది. ఇంతలో దూసుకువచ్చిన భారీ ట్రక్కు.. ఆ కారును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దాంతో కారు.. గేట్‌ను దాటుకుని రైల్ ట్రాక్‌పైకి వచ్చింది. ట్రక్కు ఢీకొనడంతో కారు డ్యామేజ్ అయ్యింది. ఇంజిన్ స్టార్ట్ అవ్వడం లేదు. ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఇంతలో అటువైపు నుంచి ట్రైన్ వస్తుండటంతో.. కారులోని కొందరు బయటకు దిగారు. డ్రైవింగ్ సీట్‌లో ఉన్న వ్యక్తి మాత్రం ఆ కారును స్టార్ట్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. చూస్తుండగానే ట్రైన్ వచ్చేసింది. ప్రమాదం తప్పదని అంతా అనుకున్నారు. కానీ, టైమ్ గాడ్.. రెప్పపాటు వ్యవధికంటే తక్కువ సమయంలోనే కారు స్టార్ట్ అవడం, అది బయటపడటం జరిగింది. కారుకి, రైలుకి మధ్య వెంట్రుకవాసి గ్యాప్ ఉందంటే ఎంత ఉత్కంఠభరిత పరిస్థితో అర్థం చేసుకోవచ్చు.
ఈ ఉత్కంఠభరిత ఘటన అంతా రైల్వే ట్రాక్ పక్కన ఏర్పాటు చేసిన సిసి కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. ఆ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. నిజంగా దేవుడే వారిని కాపాడాడంటూ కామెంట్స్ పెడుతున్నారు. వెనుక నుంచి యమబటుల్లా ట్రక్కు కారును ఢీకొట్టడం, కారు ట్రాక్‌పై నిలిచిపోవడం, రైలు దూసుకురావడం, అంతలోనే ఆ కారు సేఫ్‌గా బయటపడటం చూస్తుంటే రోమాలు నిక్కబొడుస్తున్నాయని, ఇదంతా మిరాకిల్ అని అంటున్నారు నెటిజన్లు. ఇంకెందుకు ఆలస్యం.. స్టన్నింగ్ వీడియోపై మీరూ ఓ లుక్కేసుకోండి.