Viral Video: ఎలా వస్తాయిరా బాబు మీకు ఐడియాలు.. వీడియో చూసి షాకవుతున్న నెటిజనం..
Car Stunt Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో జుగాడ్‌కి సంబంధించిన అనేక ఫన్నీ వీడియోలు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ వీడియోల్లో
Car Stunt Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో జుగాడ్‌కి సంబంధించిన అనేక ఫన్నీ వీడియోలు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ వీడియోల్లో కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. ఈ వీడియోలను చూసిన తర్వాత నెటిజన్లు అలా ఎలా చేశారంటూ.. దీర్ఘాలోచనలో పడతారు. అలాంటి జుగాడ్‌కు సంబంధించిన ఒక ఫన్నీ వీడియో.. తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూస్తే మీరు నవ్వకుండా అస్సలు ఉండలేరు. కొంతమంది చాలా ధైర్యంగా ఉంటారు. ఏదైనా పని చేయడానికి అస్సలు భయపడరు.. తమకు ఏమి జరుగుతుందోనని అస్సలు ఊహించరు.. వెనకడుగు వేయరు. చాలామందికి ఏదో ఒకటి చేయడం ప్యాషన్. అలాంటి ఈ ఘటన తాజాగా చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో చూసి చాలా మంది నువ్వడంతోపాటు.. వావ్ వీడు మామూలోడు కాదంటూ కితాబిస్తున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక వ్యక్తి తన కారును కాల్వపై ఒక వైపు నుంచి మరొక వైపుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే.. కర్రల సపోర్టుతో ఇదంతా చేస్తున్నాడు. రెండు కర్రలతో వంతెనలాగా నిర్మించి.. దానిపై తన కారును ఒక వైపు నుంచి మరొక వైపుకు తీసుకెళ్లడం మీరు చూడవచ్చు. ఈ కర్రలు.. వాహనం చక్రాల వెడల్పుకు సరిపోయేలా ఖచ్చితంగా ఏర్పాటు చేశారు. ఈ సీన్ అంతా వీడియోలో మీరు చూడవచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను చూడండి..
వైరల్ వీడియో..
అయితే.. ఈ స్టంట్ చేస్తున్నప్పుడు.. వీడియో తీస్తున్న వ్యక్తి విన్యాసాలు చేసే వ్యక్తిని ప్రోత్సహిస్తుంటాడు.. అన్న నువ్వు నువ్వు హెవీ డ్రైవర్ అంటూ సరదాగా మాట్లాడుతున్న అతని వాయిస్ కూడా వీడియోలో రికార్డయింది. ఈ వీడియో చూసి సోషల్ మీడియా నెటిజన్లు ఆశ్చర్యపోతూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తూన్నారు. డ్రైవింగ్ లైసెన్స్‌కు ఇది పరీక్షగా ఉండాలని.. ఇతను మామూలు డ్రైవర్ కాదంటూ కామెంట్లు రాస్తున్నారు. ఈ వీడియోను యూట్యూబ్‌లో PR కలర్స్ అనే యూజర్ షేర్ చేయగా.. 2 కోట్ల మందికి పైగా వీక్షించారు.
Also Read: