Viral Video: సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా జంతువులకు ఫన్నీ వీడియోలు తెగ రచ్చ చేస్తుంటాయి. అయితే కొన్ని భీకరంగా, భయానకంగా కూడా ఉంటాయి. అయితే, తాజాగా వీడియోలో మాత్రం బీభత్సానికి కామెడీ తోడయ్యింది. ఆ వీడియోను చూసి నెటిజన్లు ఫుల్లుగా నవ్వుకుంటున్నారు. సాధారణంగా గ్రామాల్లో పశువులు పోట్లాడుకోవడం జరుగుతుంటుంది. ఈ వీడియోలో కూడా రెండు ఎద్దుల మధ్య భీకర పోరు సాగుతోంది. రెండూ తమ కొమ్ములతో పోట్లాడుకుంటున్నాయి. ఇంతటి హోరా హోరి పోరులో ఊహించిన ట్విస్ట్ చోటు చేసుకుంది. పెద్దరాయుడి మాదిరిగా ఎంటైరన ఓ గ్రామ సింహం.. ఎద్దుల మధ్య పోటీని ఆపే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఓ ఎద్దును ముఖాన్ని గట్టిగా కరిచింది. దాంతో కుక్క దాటికి అదిరిపోయిన ఎద్దు.. ఆ పోరాటం నుంచి వెనక్కి తగ్గింది. అయితే, ఈ పోరు మధ్యలోకి రెండు కుక్కలు రాగా.. ఒక కుక్క మాత్రమే ధైర్యంగా సాహసించి ఎద్దుపై అటాక్ చేసింది. కుక్క దెబ్బకు వీడియోలో తెల్ల ఎద్దు బెదిరిపోయి పరుగులు తీసింది. అయితే, ఈ సీన్‌ను అంతా అక్కడే ఉన్నవారు తమ ఫోన్‌లో రికార్డ్ చేశారు. వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ ఫన్నీ వీడియోను చూసి నెటిజన్లు ఫుల్లుగా నవ్వుకుంటున్నారు. ఈ కుక్క మామూలు కుక్క కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం ఈ ఫన్నీ సీన్‌ను మీరూ చూసేయండి.
Also read:
Astro ideas: ఈ పనులు అస్సలు చేయకూడదు.. లేదంటే లక్ష్మీదేవి అగ్రహానికి గురై ఆర్థికంగా చితికిపోతారు..!
Savings Account Interest Rates: సేవింగ్స్ చేద్దామని అనుకుంటున్నారా? అధిక వడ్డీ రేట్లు లభించే బ్యాంకులివే..!