ప్రస్తుతం మానవ సంబంధాలన్నీ ఆర్ధిక బంధాలే అనిపిస్తున్న ఈ రోజుల్లో కూడా చిన్న పాటి సాయాన్ని గుర్తు పెట్టుకునే మూగజీవులున్నాయని అనేక సంఘటనలు మనకు రుజువు చేస్తూనే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే.. కనిపెంచిన తల్లిదండ్రులను కూడా కడుపున పుట్టిన పిల్లలు ఖరీదు కట్టే లోకంలో ఉన్నాం.. ఆదరించి అన్నం పెట్టిన వారినే కసాయితనంతో కడతేరుస్తున్న విశ్వాస ఘాతకుల గురించి లెక్కలేనన్ని సంఘటన గురించి వింటూనే ఉన్నాం.. అయితే తాజాగా తనకు అన్నం పెట్టిన వ్యక్తి మరణించాడని ఓ వానరం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. చూపరుల హృదయాన్ని కదిలిస్తున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
శ్రీలంకలోని తూర్పు ప్రావిన్స్‌లో బట్టికలోవా జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. స్థానికంగా ఓ వ్యక్తి మరణించాడు. అతని మృత దేహం వద్దకు అనేక కుటుంబ సభ్యలు, స్నేహితులు నివాళులు అర్పిస్తున్నారు. కుటుంబ సభ్యులు దుఃఖిస్తున్నారు. అయితే వీరితో పాటు ఒక వానరం కూడా అతని మృతదేహం వద్ద కన్నీరు పెట్టుకుంది. ఆ కోతిని గుంపులో ఉన్న వ్యక్తులు అక్కడ నుంచి తరలించడానికి చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు.
ఆ కోతికి మృతుడికి మంచి స్నేహం ఉన్నట్లు చెబుతున్నారు. ఆ కోతికి అతను రోజూ క్రమం తప్పకుండా ఆహారం పెట్టేవాడని తెలుస్తోంది. ఆ వానరం అతడితో సరదాగా ఆడుకొనేది. అయితే ఈ నెల 18న అతడు మరణించాడు. ఎప్పటిలా ఆహారం కోసం వచ్చిన కోతికి తన స్నేహితుడు కనిపించలేదు. దీంతో అతడిని వేడుకుంటోంది. అప్పుడు అతనికి అంత్యక్రియలు నిర్వహించేందుకు మృతుడి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు ఏర్పాటు చేస్తున్నారు. అంతలో వానరం తన స్నేహితుడి మృతదేహం వద్దకు చేరుకొని.. తట్టి లేపే ప్రయత్నం చేసింది. అతడి పాదాల దగ్గర కూర్చుంది.
#viralvideo : Monkey seen at the funeral of a person, who is said to have fed it regularly, whenever it visited his residence in #Batticaloa #SriLanka
Primate is seen nudging the ‘companion’ who is lying motionless, to try and see if he would respond, but to no avail ?? pic.twitter.com/5FJ1nzq9H5
— Sidharth.M.P (@sdhrthmp) October 19, 2022
ఆ వ్యక్తి ఊపిరి పీల్చుకుంటున్నాడో లేదో తనిఖీ చేయడమే కాదు.. కోతి తాను వచ్చాను అనే సందేహం ఇచ్చేలా మరణించిన వ్యక్తిని ప్రేమగా తట్టి లేపడానికి ప్రయత్నించింది. వానర ప్రేమ చూపరుల హృదయాన్ని కలిచి వేసింది. ఎంతకూ లేవకపోయే సరికి కంటతడి పెడుతూ అతడికి ముద్దు పెడుతూ నివాళులర్పించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..