ఆరోగ్యంగా, దీర్ఘకాలం ఆనందంగా బతకాలంటే ప్రతి జీవి తప్పని సరిగా ఆహారాన్ని తీసుకోవాల్సిందే. తమ తమ అభిరుచిమేరకు భిన్నమైన ఆహారాన్ని తీసుకుంటారు. అయితే ఆరోగ్యంగా జీవించడానికి సమతుల్య ఆహారం తప్పనిసరి అన్న సంగతి తెలిసిందే. అయితే కొంతమంది ఆహారప్రియులు రోజూ రకరకాల ఆహార పదార్ధాలను తినడానికి ఆసక్తిని చూపిస్తారు. ఈ ఆసక్తి వలన ఎల్లలుదాటి ఆహారం ఇతర ప్రాంతాల వారి ఆదరణ సొంతం చేసుకుంటుంది. అయితే ఎంతటి ఆహార ప్రియులైనా సరే ఓ మహిళకు ఇష్టమైన ఆహారాన్ని తినడానికి ఇష్టపడరు. ఇంకా చెప్పాలంటే ఆ మహిళ ఇష్టంగా తినేది ఏమిటో తెలిస్తే కలలో కూడా అటువంటి ఆహారం గురించి ఆలోచించరు కూడా.. ఎందుకంటే ఆ మహిళ తన సొంత ఇంటి గోడలను తినేస్తుంది. ఇది ఎవరికైనా వింతగా అనిపించవచ్చు. కానీ ఇది పూర్తిగా నిజం.
అమెరికాలోని మిచిగాన్ నివాసి నికోల్.. తన వింత హాబీల కారణంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తోంది. ఎందుకంటే నికోల్ కు చైనీస్ లేదా ఇటాలియన్ ఫుడ్ వంటివి ఇష్టం ఉండవు. నికోల్ తన ఇంటి గోడల ముక్కలను తినడానికి ఇష్టపడుతుంది. ఈ అభిరుచి కారణంగా ఆమె తన ఇంటిని మొత్తం తినేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. తన సొంత ఇంటిని మాత్రమే కాదు తాను ఎక్కడికి వెళ్లినా సరే వారి ఇంటి గోడలను కూడా తినేస్తుంది. బంధువుల ఇళ్లను, స్నేహితుల ఇళ్లను కూడా ఇష్టంగా తినేస్తుంది.
నికోల్ తమ ఇంటి గోడలను ముక్కలుగా చేసుకుని తినేస్తుండడంతో ఆమెని ఇంట్లోకి రానివ్వకుండా చాలా మంది బంధువులు, స్నేహితులు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. నికోల్ ఫుడ్ హాబిట్ కు సంబంధించిన కథ TLCలో భాగస్వామ్యం చేయబడింది. నికోల్ కు సడెన్ గా తన ఇంటి ప్లాస్టార్ బోర్డ్ తో ఉన్న గోడలను తినాలనే ఇష్టం కలిగింది. ఆహారానికి బదులుగా ఇంటి గోడలగా ఉన్న ప్లాస్టార్ బోర్డ్ ని ఇష్టపడటం ప్రారంభించింది. అయితే, చికిత్స పొందిన తర్వాత ఆమె పరిస్థితి చాలా మెరుగుపడుతోంది. ఇలా తినడం కొనసాగితే ఆమె పరిస్థితి విషమించి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు.
ఆశ్చర్యకరంగా నికోల్‌కు తాను ప్లాస్టార్ బోర్డ్ ని తినడం వలన వచ్చే ప్రమాదం గురించి బాగా తెలుసు. అయినా ఇప్పటికీ ఆమె తన తిండి అలవాటుని విరమించుకోవడం లేదు. TLCతో మాట్లాడుతున్నప్పుడు, చాలా మంది తన అలవాటుతో కలత చెందుతున్నారని.. కొంతమంది అయితే తమ ఇంటికి రాకుండా నికోల్ ని అడ్డుకుంటున్నారు కూడా.. ఎందుకంటే చాలా మంది పొరుగువారు.. నికోల్ ను తమ ఇంటికి పిలిస్తే తమ ఇంటి గోడను కూడా తినేస్తుందేమో అని భయపడుతున్నారని చెబుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.