Viral Video: ప్రతి మనిషి జీవితంలో పెళ్లి మధురమైన ఘట్టం. తమ ఆచార, సంప్రదాయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ తమ పెళ్లి ప్ వేడుకలను ప్రత్యేకంగా చేసుకోవాలని కోరుకుంటారు. అందుకు ప్రజలు వివిధ మార్గాల్లో ప్రయత్నిస్తారు. పెళ్లి వేడుకకు సంబంధించిన అనేక వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటాయి. కొన్ని పెళ్లిళ్ల గురించి విన్నా.. వివాహం జరిగే విధానం చూసినా ఆశ్చర్యపోతూ ఉంటారు. ముఖ్యంగా గాడిదను పెళ్లి చేసుకున్న వరుడు, మొక్కను పెళ్లి చేసుకున్న వరుడు వంటి అనేక పెళ్లిళ్ల గురించి వింటూనే ఉన్నాం.. ఈ నేపథ్యంలో తాజాగా ఓ వింత పెళ్లి వార్తల్లో నిలిచింది. ఈ పెళ్లిలో విచిత్రం ఏంటంటే.. వధువుకు బదులు వరుడు మొసలిని పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ పెళ్లిని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
ఈ వింత పెళ్లి మెక్సికోలో జరిగింది. శాన్ పెడ్రో హువామెలులా మేయర్ సెటోర్ హ్యూగో ఆచార సాంప్రదాయాలను అనుసరించి.. మొసలిని ఘనంగా వివాహం చేసుకున్నాడు. ఈ వివాహానికి వేలాది మంది హాజరయ్యారు. పెళ్లి జరిగే సమయంలో వధువుకి చేయాల్సిన ఆచారాలను వరుడి బంధువులు నిర్వహించారు. ఈ వివాహం పర్యావరణం, మానవులు, జంతువుల మధ్య సంబంధాలకు సజీవ సాక్ష్యం అని అంటున్నారు.
In an age-old ritual, a Mexican mayor married his alligator bride to secure abundance. Victor Hugo Sosa sealed the nuptials by kissing the alligator’s snout https://t.co/jwKquOPg93 pic.twitter.com/Vmqh4GpEJu
— Reuters (@Reuters) July 1, 2022
మెక్సికోలో మొసలిని పెళ్లి చేసుకునే ఆచారం ఇప్పటిది కాదని..పురాతన ఆచారమని చెబుతారు. ఇది 1789 సంవత్సరం నుంచి ఈ దేశంలో జరుగుతోంది. ఇలా మొసలిని పెళ్లి చేసుకోవడం వల్ల పట్టణంలో ఎప్పుడూ చెడు జరగదు. ఆ ప్రాంతం ఎల్లప్పుడూ జనాభాతో ఉంటుంది. ఈ రకమైన వివాహం చేసుకున్న వ్యక్తి.. భగవంతుని నుండి కోరుకున్న వస్తువును పొందుతారని ఒక నమ్మకం. అంతేకాదు.. తమ ప్రాంతంలో మంచి వర్షాలు కురవాలని, వేటలో చేపలు ఎక్కువగా పడాలని చాలా మంది మొసలిని పెళ్లి చేసుకుంటారు. నగర మేయర్ కూడా అదే ఉద్దేశ్యంతో ఈ పెళ్లి చేసుకున్నారు. మొసలి మొదటి పేరు మొదట ప్రస్తావిస్తూ.. తర్వాత వివాహ తేదీని తెలుపుతూ.. బంధువులకు, స్నేహితులకు వివాహ ఆహ్వానాన్ని పంపుతారు. ఆ తర్వాత అందరి సమక్షంలో వివాహం జరిపిస్తారు.
ఈ వివాహ సమయంలో.. మొసలిని వధువుగా సంప్రదాయంగా అలంకరించారు. తెల్లటి పెళ్లి దుస్తులతో పాటు అలంకరణలతో వధువు వలె ఉంటుంది. ఆ తరువాత మేయర్ మొసలిని వివాహం చేసుకున్నారు. ఇకనుంచి తమను తాము దైవ పురుషులుగా భావిస్తారు. ఈ సమయంలో.. మేయర్ ఆడ మొసలిని కూడా ముద్దు పెట్టుకున్నారు. అయితే ఇలా ముద్దు పెట్టుకునే సమయంలో మొసలి నోరు ఒక గుడ్డతో శుభ్రం చేస్తారు. తద్వారా అది వరుడికి ఏ విధంగానూ హాని కలిగించదు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..