చీరలతో గర్భా డ్యాన్స్ చేసే పురుషులు.. ఈ సంప్రదాయం వెనుక 200 ఏళ్లనాటి కథ.. వీడియో వైరల్
దసరా నవరాత్రుల్లో అనేక ప్రాంతాల్లో గర్భా సందడి మొదలవుతుంది. అయితే ఒక ప్రాంతంలో గర్బా ఆచారం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. పురుషులు చీరలలో నృత్యం చేయడం వెనుక 200 సంవత్సరాల నాటి రహస్యం ఉంది. అహ్మదాబాద్ కి చెందిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. @awesome.amdavad అనే ఖాతాలో అప్‌లోడ్ చేయబడిన ఈ రీల్ "అహ్మదాబాద్‌లోని సాధు మాతా ని పోల్‌లో చీర.. గర్బా ఆచారం" అనే పేరుతో షేర్ చేశారు. దీనిలో పురుషులు చీరలను ధరించి గర్బా ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తుంది.

పవిత్రమైన నవరాత్రి పండుగ ( నవరాత్ర 2025 ) అనేక ప్రాంతాల్లో గర్బా డ్యాన్స్ సందడి కనిపిస్తూ ఉంటుంది. అయితే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ఒక ప్రత్యేకమైన ఆచారం దేశం దృష్టిని ఆకర్షించింది. ప్రతి సంవత్సరం సాదు మాతా ని పోల్ ప్రాంతానికి చెందిన పురుషులు చీరలు ధరించి గర్బాని ప్రదర్శిస్తారు. ఇది వింటే ఎవరైనా ఆశ్చర్యపోతారు. అయితే ఈ గర్బా నృత్యం సమయంలో ఈ ఆచారం పాటించడం వెనుక 200 సంవత్సరాల నాటి శాపం.. దాని నుంచి విముక్తి పొందిన కథ ఉంది.
దీనికి సంబంధించిన వీడియో ఇటీవల వైరల్‌గా మారి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. @awesome.amdavad అనే ఖాతాలో అప్‌లోడ్ చేయబడిన ఈ రీల్ పేరు “అహ్మదాబాద్‌లోని సాదు మాతా ని పోల్‌లో చీర గర్బా ఆచారం”. సదుమా నా గర్బా అని పిలువబడే ఈ ఆచారాన్ని ప్రతి సంవత్సరం నవరాత్రి ఎనిమిదవ రాత్రి బరోట్ కమ్యూనిటీకి చెందిన పురుషులు నిర్వహిస్తారు.
ఈ 200 సంవత్సరాల సంప్రదాయం ఏమిటి?
View this post on Instagram
స్థానిక గాథల ప్రకారం.. 200 సంవత్సరాల క్రితం సాదుబెన్ అనే మహిళ మొఘల్ కులీనుడు నుంచి తనను తాను రక్షించుకోవడానికి బారోట్ కమ్యూనిటీకి చెందిన పురుషుల సహాయం కోరింది. పురుషులు ఆమెను రక్షించడంలో విఫలమైనప్పుడు.. సాదుబెన్ తన బిడ్డను కోల్పోయింది. కోపంతో.. హృదయ విదారకంగా సాదుబెన్ ఆ పురుషులను శపించింది. వారి భవిష్యత్ తరాలు పిరికివాళ్ళు అవుతాయని చెప్పింది. అప్పుడు ఆమె పెట్టిన శాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి.. సాదుబెన్ శాపానికి గౌరవం వ్యక్తం చేయడానికి, బారోట్ కమ్యూనిటీకి చెందిన పురుషులు ప్రతి సంవత్సరం చీరలు ధరించి గర్బా ప్రదర్శిస్తారు.
ఇప్పటి వరకూ ఈ వైరల్ రీల్‌ను 3 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. 83,000 మందికి పైగా లైక్ చేశారు. నెటిజన్లు ఆ పురుషుల ధైర్యం .. అంకితభావాన్ని ప్రశంసిస్తున్నారు. ఒక యూజర్ “సంప్రదాయాన్ని కొనసాగించిన వారు ధన్యులు” అని వ్యాఖ్యానించారు. మరొక యూజర్ “ఓ స్త్రీ రేపు రా” తరహా వైబ్ ఇస్తుందని అన్నారు. మరొక యూజర్ “దేవత రూపంలో దేవత భక్తి” అని రాశారు.
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




