AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: కల్తీ అవుతున్న కొబ్బరి బోండాలు.. షాకింగ్‌ వీడియో చూశారంటే..

కొబ్బరి నీళ్ళు అత్యంత స్వచ్ఛమైనవి. అందరికీ సురక్షితమైనవిగా భావిస్తారు. ఎటువంటి కల్తీకి అవకాశం లేనిది కొబ్బరి బోండాం అని ప్రజల్లో పూర్తి భరోసా ఉంటుంది. కానీ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో మాత్రం అందరినీ షాక్‌ అయ్యేలా చేస్తోంది. ఇది లేత కొబ్బరికాయకు ఇంజెక్ట్ చేస్తున్న వీడియో. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకిలా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారంటూ ఇలాంటి పనులు చేస్తున్న కేటుగాళ్లపై మండిపడుతున్నారు. పూర్తి డిటెల్స్‌లోకి వెళితే...

Watch: కల్తీ అవుతున్న కొబ్బరి బోండాలు.. షాకింగ్‌ వీడియో చూశారంటే..
Man Inject Chemical In Coconut Water
Jyothi Gadda
|

Updated on: Oct 23, 2025 | 9:14 PM

Share

వేసవి వచ్చిందంటే చాలు కొబ్బరి బోండాలు, కొబ్బరి నీళ్లకు గిరాకీ పెరుగుతుంది. కొందరు సీజన్‌తో పనిలేకుండా మంచి ఆరోగ్యం కోసం ప్రతి రోజూ కొబ్బరి నీళ్లు తాగుతూ ఉంటారు. కాస్త ఖరీదు ఎక్కువనిపించినా కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో కార్బోహైడ్రేట్లు, ముఖ్యమైన పోషకాలతో సహజంగా లభించే కొబ్బరి బోండాలు చాలా ఉత్తమం. ఇంకా మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్ పోషకాలు పుష్కలంగా వీటిల్లో లభిస్తాయి. కానీ, కొందరు కంత్రీగాళ్లు కొబ్బరి బోండాలను కూడా కల్తీ చేస్తున్నారు. కొబ్బరికాయలను పెద్దవిగా, బరువుగా చేయడానికి రసాయనాలను ఇంజెక్ట్ చేస్తున్నారని చూపించే వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో ఆన్‌లైన్‌లో తవ్ర చర్చకు దారితీసింది.

గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఇలాంటి వీడియోలు గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొన్నిసార్లు కూరగాయలకు రసాయనాలు ఎక్కించడం, పండ్లలోకి ఇంజెక్ట్ చేయడం వంటివి చూపించారు. ఈ రసాయనాలు మన శరీరానికి, ఆరోగ్యానికి పూర్తిగా అనారోగ్యకరమైనవి. షాకింగ్‌ కామెంట్స్‌తో స్పందించారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

కొబ్బరి నీళ్ళు మాత్రమే నమ్మకానికి మూలం, అది కల్తీ లేనిదని నమ్మేవారు, కానీ ఇప్పుడు అది కూడా ఇంజెక్ట్ చేయబడుతోంది. దీని అర్థం తినదగిన వాటిపై నమ్మకం సన్నగిల్లుతూనే ఉంటుంది. ఈ వీడియోలు ప్రజలలో ఆగ్రహాన్ని రేకెత్తించాయి. మార్కెట్ నుండి పండ్లు, కూరగాయలు కొనుగోలు చేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ అవసరమని ప్రజలు అంటున్నారు. లేకుంటే మనం పండ్లకు బదులుగా విషాన్ని తినే ప్రమాదం ఉందంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..