Viral Video: ప్యాసింజర్ రైలులో ఘటనపై నటి రిచా చద్దా స్పందన… సిగ్గుచేటు అంటూ X లో పోస్ట్

ప్యాసింజర్ రైలులో ఒక వ్యక్తి మైనర్ బాలికతో దారుణంగా ప్రవర్తించినట్లు చూపించే వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది. ఈ వైరల్ వీడియోపై బాలీవుడ్ నటి రిచా చద్దా స్పందించారు. ఆ వ్యక్తిని తోటి ప్రయాణికుడు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అలాంటి ప్రవర్తనను ఖండిస్తూ...

Viral Video: ప్యాసింజర్ రైలులో ఘటనపై నటి రిచా చద్దా స్పందన... సిగ్గుచేటు అంటూ X లో పోస్ట్
Richa Chadha Condemns Samef

Updated on: Oct 21, 2025 | 5:32 PM

ప్యాసింజర్ రైలులో ఒక వ్యక్తి మైనర్ బాలికతో దారుణంగా ప్రవర్తించినట్లు చూపించే వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది. ఈ వైరల్ వీడియోపై బాలీవుడ్ నటి రిచా చద్దా స్పందించారు. ఆ వ్యక్తిని తోటి ప్రయాణికుడు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అలాంటి ప్రవర్తనను ఖండిస్తూ, రిచా తన X హ్యాండిల్‌లో తిరిగి షేర్‌ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. “అతన్ని ఫేమస్ చేద్దాం. మనమందరం ఇలాంటి చాలా మంది సహ ప్రయాణీకులను కలిశాము. సిగ్గుచేటు” అని రాసింది.

వీడియో చూడండి:

వైరల్ వీడియోలో ఖాళీ రైలులో ఒక మైనర్ బాలికకు దగ్గరగా కూర్చున్న ఒక వ్యక్తి ఆమెను అనుచితంగా తాకినట్లు చూపిస్తుంది. మరొక ప్రయాణీకుడు ఆ షాకింగ్ చర్యను చిత్రీకరిస్తుండగా. మైనర్ బాలికను అనుచితంగా తాకినందుకు సహ ప్రయాణీకుడు ఆ వ్యక్తిని ప్రశ్నిస్తాడు. అతను తడబడి చర్చను మళ్లించడానికి ప్రయత్నించాడు. దాని నుండి బయటపడటానికి అతను ప్రయత్నించాడు. కానీ, చివరికి పరోక్షంగా తన తప్పును అంగీకరించాల్సి వచ్చింది.

“ఈ వీడియో ఒక సాధారణ రైలు కంపార్ట్‌మెంట్‌కు సంబంధించినది, అక్కడ ఈ కళ్లద్దాలు ధరించిన వ్యక్తి తన నీచపు బుద్దిని చూపించాడు. ఈ వ్యక్తి తన సొంత కూతురిలాంటి బాలిక వద్ద కూర్చుని చాలా అసహ్యకరమైన రీతిలో తాకడానికి ప్రయత్నించాడు. ఈ సమయంలో, ఒక అబ్బాయి అతని వీడియోను రికార్డ్ చేశాడు.

వీడియో వైరల్ అయిన వెంటనే, నెటిజన్లు పోక్సో చట్టం కింద ఆ వ్యక్తిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.