గత కొంతకాలంగా వయసుతో సంబంధం లేకుండా హఠాత్తుగా మరణిస్తున్నారు. సెలబ్రెటీలు, సామాన్యులని లేదు.. ఆడుతూ, వ్యాయామం చేస్తూ.. డ్యాన్స్ చేస్తూ..సడన్ గా మరణిస్తున్నారు. తాజాగా మళ్ళీ ఓ గుప్పెడంత గుండె ఆగిపోయింది. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్ జిల్లా డోంగర్‌ఘర్‌లో జరిగిన ఓ వివాహ వేడుకలో వేదికపై డ్యాన్స్ చేస్తూ ఓ వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అక్కడిక్కడే మరణించిన ఘటన సంచలనం రేపింది. మృతుడు బలోద్ జిల్లాకు చెందిన దిలీప్ రౌజ్‌కర్‌గా గుర్తించారు. అతను భిలాయ్ స్టీల్ ప్లాంట్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.
మీడియా నివేదికల ప్రకారం.. మే 4 వ తేదీ రాత్రి తన మేనకోడలు పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. వేదికమీద సరదాగా డ్యాన్స్ చేస్తున్న దిలీప్ అకస్మాత్తుగా విశ్రాంతి తీసుకోవడానికి వేదిక మీద కూర్చున్నాడు. అపుడు గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. ఈ ఘటన మొత్తం కెమెరాకు చిక్కగా.. ఈ దుర్ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వీడియోలో, డోంగర్‌ఘర్‌లో తన మేనకోడలు వివాహ వేడుకకు హాజరైన దిలీప్, మొదట వేదికపై మరికొంత మందితో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేయడాన్ని చూడవచ్చు. అతను అకస్మాత్తుగా ఆగి వేదికపై కూర్చున్నాడు.. కొన్ని క్షణాల తర్వాత కుప్పకూలిపోయాడు.
10 May 2023 : ?? : BSP engineer got ?attack? while dancing at niece’s wedding, died#heartattack2023 #TsunamiOfDeath pic.twitter.com/b0dNv3k2Av
— Anand Panna (@AnandPanna1) May 10, 2023
వెంటనే దిలీప్ ను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో పెళ్లింట విషాదం నెలకొంది.
ఇటీవల తరచుగా గుండెపోటుకు గురై అకస్మాత్తుగా మరణిస్తున్నవారి సంఖ్య దేశ వ్యాప్తంగా ఎక్కువ అవుతున్నాయి. కొన్ని ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..