Viral Video: ఫేమ్ కోసం ఈఫిల్ టవర్ ఎక్కిన యువకుడు.. వీడియో షూటింగ్‌పై నెటిజన్లు ఫైర్..

|

Nov 03, 2023 | 9:54 AM

ఈ వీడియోలో ఒక యువకుడు పారిస్‌లోని ఈఫిల్ టవర్ ఎక్కి వీడియో చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తాడు. ఎలాంటి భయం లేకుండా, ఎలాంటి భద్రత లేకుండా టవర్ అంచుల్లో నడుస్తూ కనిపిస్తున్నాడు. ఈ దృశ్యం ఎవరికైనా కనువిందు చేస్తుంది. ఆ వ్యక్తి ఈఫిల్ టవర్ ఎత్తుకు ఎలా ఎక్కాడో, అలాగే పైనుంచి కిందకు చూస్తూ ఎలా పైకి ఎక్కాడో తన కెమెరా ద్వారా చూపించే ప్రయత్నం చేస్తున్నాడనేది ఈ వీడియోలో చూడవచ్చు.

Viral Video: ఫేమ్ కోసం ఈఫిల్ టవర్ ఎక్కిన యువకుడు.. వీడియో షూటింగ్‌పై నెటిజన్లు ఫైర్..
Viral Video
Follow us on

ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అవ్వాలని కోరుకుంటున్నారు. ప్రపంచంలో సోషల్ మీడియా వల్ల ఫేమస్ అయిన వారు చాలా మంది ఉన్నారు. అంతేకాదు రీల్స్ ద్వారా చాలా డబ్బు కూడా సంపాదిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో ప్రజలు ప్రసిద్ధి చెందాలని కోరుకుంటున్నారు. అయితే కొన్నిసార్లు యువతీ యువకులు పేరు తెచ్చుకోవడానికి ఏదైనా చేస్తున్నారు.. ఏ స్థాయికైనా వెళ్తున్నారు. చివరకు ప్రాణాంతకమైన పనులు చేస్తూ  రిస్క్‌ చేయడానికి కూడా వారు భయపడడంలేదు.. సిగ్గుపడడం లేదు కూడా. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఇది ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది.

ఈ వీడియోలో ఒక యువకుడు పారిస్‌లోని ఈఫిల్ టవర్ ఎక్కి వీడియో చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తాడు. ఎలాంటి భయం లేకుండా, ఎలాంటి భద్రత లేకుండా టవర్ అంచుల్లో నడుస్తూ కనిపిస్తున్నాడు. ఈ దృశ్యం ఎవరికైనా కనువిందు చేస్తుంది. ఆ వ్యక్తి ఈఫిల్ టవర్ ఎత్తుకు ఎలా ఎక్కాడో, అలాగే పైనుంచి కిందకు చూస్తూ ఎలా పైకి ఎక్కాడో తన కెమెరా ద్వారా చూపించే ప్రయత్నం చేస్తున్నాడనేది ఈ వీడియోలో చూడవచ్చు. అనుమతి లేకుండా ఈఫిల్ టవర్ ఎక్కి వీడియో తీస్తున్నట్లు సమాచారం. ఈఫిల్ టవర్ ఎత్తు వెయ్యి అడుగుల కంటే ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి భద్రత లేకుండా అంత ఎత్తు ఎక్కడం ప్రమాదకరమని అందరికి తెలుసు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి

అయితే అనుమతి లేకుండా ఈఫిల్ టవర్ ఎక్కేందుకు సాహసించిన యువకుడిని గుర్తించడం సాధ్యం కాలేదు. హృదయాన్ని కదిలించే ఈ వీడియో @XvideoViral అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో భాగస్వామ్యం షేర్ చేశారు. కేవలం 26 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ఇప్పటి వరకు వేల మంది వీక్షించారు. ప్రజలు వివిధ రకాల రియాక్షన్‌లు, కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో విజిబిలిటీని పెంచుకోవడానికి ఇది తప్పు మార్గం అని కామెంట్ చేయగా.. అసలు నేటి యువత ప్రమాదాన్నీ లెక్కచేయడం లేదని.. ప్రమాదాన్ని తక్కువగా అంచనా వేస్తున్నారని  అని ఒకరు రాస్తే, ‘ఈ దృశ్యాన్ని చూడగానే నా కాళ్లు వణుకుతున్నాయి’ అని ఒకరు కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..