
ప్రస్తుతం ఓ ఆర్టిస్ట్ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చాలా సంచలనం సృష్టిస్తోంది. వాస్తవానికి ఈ వీడియో చాలా అద్భుతంగా ఉంది. వ్యక్తి ప్రతిభను ప్రశంసించకుండా ఉండలేరు. ఇందులో వ్యక్తి మేకప్ ద్వారా దివంగత పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ లాగా తనకు తాను ఖచ్చితమైన రూపాన్ని ఇచ్చుకున్నాడు. ఆ వ్యక్తిలోని అద్వితీయ ప్రతిభ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఆ వ్యక్తిని నిజమైన మైఖేల్ జాక్సన్ ఏమో అని పొరబడతారు.
ఆ వ్యక్తిని సోషల్ మీడియాలో గుస్ జాక్సన్ అని పిలిచే గుస్తావో హ్డెజ్‌గా గుర్తించారు. మేకప్ సహాయంతో గుస్తావో తనకు తానుగా దివంగత పాప్ రాజు మైఖేల్ జాక్సన్ రూపాన్ని ఇచ్చుకున్నాడు. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి ఫేస్‌బుక్‌లో వైరల్ అవుతోంది, దీనిలో ఇంటర్నెట్ ప్రజలు మేకప్ పరివర్తనను చూసి ఆశ్చర్యపోయారు. గుస్తావో ఎలా మేకప్ తో మైఖేల్ జాక్సన్‌గా మారాడో వీడియోలో చూడవచ్చు.
బాయ్స్ డూ ఇట్ టూ పేరుతో ఫేస్‌బుక్ పేజీలో ఆగస్టు 21న షేర్ చేసిన ఈ వీడియో విపరీతంగా సందడి చేస్తోంది, దీనికి 3 లక్షల వీక్షణలు వచ్చాయి. వేలాది మంది దీన్ని లైక్ చేశారు. అంతే కాకుండా రకరకాలా కామెంట్స్ చేస్తున్నారు. ఒకరు ఇది నిజమైన మైఖేల్ జాక్సన్ ఏమో అనిపిస్తుంది అని అంటే.. మరికొందరు ఆ కుర్రాడిలో టాలెంట్ ఉందని అంటున్నారు. ఓవరాల్ గా గుస్తావో అద్వితీయ ప్రతిభకు అందరూ ఫ్యాన్స్ అయిపోయారు.
గుస్తావో యుక్తవయసులో ఉన్నప్పుడు అతను మైఖేల్ జాక్సన్‌ను అనుకరించడం ప్రారంభించాడు. ఇప్పుడు అతని ఈ కళ కారణంగా ప్రస్తుతం ప్రజలలో చాలా ప్రసిద్ధి చెందాడు. గుస్తావో ఇప్పుడు ప్రొఫెషనల్ మైఖేల్ జాక్సన్ ట్రిబ్యూట్ ఆర్టిస్ట్. అతను అనేక చిత్రాలలో మైఖేల్ జాక్సన్ పాత్రను కూడా పోషించాడు. 2009లో కింగ్ ఆఫ్ పాప్ మరణం తర్వాత, అతని ప్రజాదరణ ఎంతగా పెరిగిందంటే.. వివిధ దేశాల్లో డిమాండ్ కూడా ఉంది. మార్చి 24, 2018న స్పెయిన్‌లో జరిగిన ఒక వేడుకలో Mjvibe.com వెబ్‌సైట్ ద్వారా అతను యూరప్‌లో ఉత్తమ అనుకరణ ఆర్టిస్టుగా ప్రపంచవ్యాప్తంగా రెండవ స్థానాన్ని పొందాడు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..