Viral Video:ప్రపంచం ఎన్నో వింతలు, విశేషాలు.. అద్భుతాలతో నిండివుంది. మనుషులతో పాటు.. జీవించే జీవరాశులలో అనేక ఆశ్చర్యకరమైనవి ఉన్నాయి. అసలు ప్రకృతిలో ప్రతి జీవి ఓ అద్భుతమే. భారీ జీవులు, అందంగా అలరించే జీవులు, రంగులు మార్చే జీవులు ఇలా రకరకాలు దర్శనమిస్తాయి. అయితే రంగులు మార్చే జీవి ఏది అంటే వెంటనే ఊసరవెల్లి అని చెప్పేస్తారు ఎవరైనా.. నిజానికి ఆక్టోపస్ కూడా రంగును మార్చగలదు. ఊసరవెల్లిలా ఎప్పుడుపడితే అప్పుడు మార్చకపోయినా.. ఆక్టోపస్ అప్పుడప్పుడు శరీరంలో రంగులు మార్చుకుంటుంది..
తనకు అవసరమైనప్పుడు ముఖ్యంగా శత్రువు నుంచి తప్పించుకునేందుకు ఆక్టోపస్ ప్రత్యేక లక్షణాలను కలిగిఉంటుంది. తన శరీర ఆకృతిని తరచుగా మార్చుకునే ఆక్టోపస్ కు చెందిన ఓ వీడియో తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
సముద్రంలోని జీవించే జీవుల గురించి మాట్లాడుకుంటే.. కచ్చితంగా ఆక్టోపస్ లను గుర్తు చేసుకుంటాం.. రూపానికి వింతగా కనిపించే ఈ ప్రత్యేక జీవి ఆక్టోపస్ రంగులు మార్చుకుంటున్న వీడియో నెట్టింట్లో షేర్ అవుతుంది. ఆక్టోపస్ సముద్రంలో ఈదుతూ.. తన చుట్టూ ఉన్న రంగుల్లో కలిసిపోయిన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. రంగులు మార్చుకుంటున్న ఆక్టోపస్ ను చూసిన నెటిజన్లు అద్భుతం అంటున్నారు. ఈ ఆక్టోపస్ మొజాంబిక్ తీరంలో చక్కర్లు కొడుతుండగా తీసినట్లు తెలుస్తోంది.
An incredible example of color changing and camouflage by an octopus filmed off the coast of Mozambique.
Credit: Nick Rubergpic.twitter.com/PBY4tXcCTy
— Wonder of Science (@wonderofscience) July 6, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..