AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: హఠాత్తుగా నడిరోడ్డుపై బస్సు ఆపిన డ్రైవర్‌… తర్వాతి సీన్‌ చూసి ప్రయాణికులు షాక్‌

కర్ణాటక ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఒకరు నమాజ్ కోసం నడిరోడ్డుపై బస్సును ఆపడం, ప్రయాణికుల సీటులో కూర్చుని ప్రార్థన చేయడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. డ్రైవర్ నమాజ్ పూర్తయ్యే వరకు ప్రయాణికులు నిస్సహాయంగా వేచి ఉండాల్సి వచ్చింది. కొంతమంది ప్రయాణికులు ఈ సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా...

Viral Video: హఠాత్తుగా నడిరోడ్డుపై బస్సు ఆపిన డ్రైవర్‌... తర్వాతి సీన్‌ చూసి ప్రయాణికులు షాక్‌
Driver Namaz In Bus
K Sammaiah
|

Updated on: May 01, 2025 | 4:07 PM

Share

కర్ణాటక ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఒకరు నమాజ్ కోసం నడిరోడ్డుపై బస్సును ఆపడం, ప్రయాణికుల సీటులో కూర్చుని ప్రార్థన చేయడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. డ్రైవర్ నమాజ్ పూర్తయ్యే వరకు ప్రయాణికులు నిస్సహాయంగా వేచి ఉండాల్సి వచ్చింది. కొంతమంది ప్రయాణికులు ఈ సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ గా మారింది. ప్రయాణికుల ఫిర్యాదుతో స్పందించిన అధికారులు సదరు డ్రైవర్ పై విచారణకు ఆదేశించారు. కాగా, ఈ ఘటనపై కర్ణాటక రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి తీవ్రంగా స్పందించారు. పనివేళల్లో ప్రార్థనలు చేయడం నిబంధనలకు విరుద్ధమని, సదరు డ్రైవర్ పై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

మంగళవారం సాయంత్రం హుబ్లీ-హవేరి మార్గంలోని జవేరి సమీపంలో ఈ సంఘటన జరిగింది. రహదారి పక్కన బస్సును నిలిపివేసిన ఆర్టీసీ డ్రైవర్, బస్సులోని ఓ సీటుపై కూర్చుని నమాజ్ చేశారు. ఆ సమయంలో బస్సులో కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. వారు డ్రైవర్ ప్రార్థనలు పూర్తయ్యే వరకు నిస్సహాయంగా వేచి చూడాల్సి వచ్చింది. ఈ ఘటనపై కొందరు ప్రయాణికులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ఈ విషయంపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆర్టీసీ మేనేజర్‌కు రాసిన లేఖలో, ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేసే సిబ్బంది తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. “ప్రతి ఒక్కరికీ తమ మతాన్ని ఆచరించే హక్కు ఉన్నప్పటికీ, విధి నిర్వహణ సమయంలో కాకుండా ఇతర సమయాల్లో చేసుకోవాలి. బస్సులో ప్రయాణికులు ఉన్నప్పుడు మార్గమధ్యలో బస్సు ఆపి నమాజ్ చేయడం అభ్యంతరకరం” అని మంత్రి పేర్కొన్నారు. విచారణ జరిపి, డ్రైవర్ తప్పు చేసినట్లు తేలితే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

వీడియో వైరల్ :