Viral Video: ఈ చిన్నారి వయసు నాలుగేళ్లు.. విన్యాసాలు చూస్తే అదుర్స్‌.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో

Viral Video: ఈ రోజుల్లో అనేక వీడియోలు సోషల్‌ మీడియాలో కనిపిస్తుంటాయి. కొన్ని వీడియోలు మాత్రం తెగ వైరల్‌ అవుతుంటాయి. ఏమి తెలియని చిన్నారులు సైతం అద్భుతమైన..

Viral Video: ఈ చిన్నారి వయసు నాలుగేళ్లు.. విన్యాసాలు చూస్తే అదుర్స్‌.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో
Viral Video
Follow us
Subhash Goud

|

Updated on: Aug 16, 2021 | 11:54 AM

Viral Video: ఈ రోజుల్లో అనేక వీడియోలు సోషల్‌ మీడియాలో కనిపిస్తుంటాయి. కొన్ని వీడియోలు మాత్రం తెగ వైరల్‌ అవుతుంటాయి. ఏమి తెలియని చిన్నారులు సైతం అద్భుతమైన విన్యాసాలతో నెటిజన్లను ఆకట్టుకుంటారు. తాజాగా ఓ నాలుగు సంవత్సరాల అమ్మాయి చేస్తున్న విన్యాసాలు చూపరులను ఇట్టే ఆకట్టుకుంటోంది. చిన్నారి చేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంత చిన్న వయసున్న చిన్నారి అద్భుతమైన విన్యాసాలు, ఫిట్స్‌కు ప్రజలు ఆశ్యర్యపోతున్నారు. ఈ అమ్మాయి శరీరం రబ్బరు లాగా ఉన్నట్లు ఎన్నో విన్యాసాలు చేస్తూ అందరిని ఆశ్యర్యపరుస్తోంది. అందుకు ఈమెను రగ్బర్‌ గర్ల్‌ అని పిలుస్తున్నారు. సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను ఇప్పటి వరకు 40 లక్షలకుపైగా మంది వీక్షించారు. అంతేకాదు 94 వేలకుపైగా లైక్‌లు, వేలకు వేలు కామెంట్లు వస్తున్నాయి. అయితే ఇది చూసిన కొందరు నెటిజన్లు కరాటే శిక్షనా కేంద్రానికి చెందినదిగా చెబుతుండగా, అక్కడ చాలా మంది పిల్లలు ఉన్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆమె తన కాళ్లను నుదుటిపై తాగడం, అలాగే వివిధ రకాలుగా విన్యాసాలు చేయడం ఈ వీడియోలో చూడవచ్చు. అయితే ఈ వీడియో ఎక్కడిదో కానీ.. సోషల్‌ మీడియాలో మాత్రం తెగ వైరల్‌ అవుతోంది.

ఇవీ కూడా చదవండి: Viral Video: అడవి దున్నపై హైనాల గుంపు ఎటాక్.. చివరికి ఏం జరిగిందంటే.. వీడియో చూస్తే షాకవుతారు!

Viral Pic: ఈ ఫోటోలో మంచు చిరుత దాగుంది.. కనిపెట్టగలరా.? చాలామంది గుర్తించలేకపోయారు.!