Viral Video: అడవి దున్నపై హైనాల గుంపు ఎటాక్.. చివరికి ఏం జరిగిందంటే.. వీడియో చూస్తే షాకవుతారు!

అడవిలో జీవనం సాహసాలతో నిండి ఉంటుంది. ఎప్పుడూ బ్రతుకు పోరాటం చెయ్యక తప్పదు. బలం, తెలివి, వ్యూహం లేకపోతే క్రూర..

Viral Video: అడవి దున్నపై హైనాల గుంపు ఎటాక్.. చివరికి ఏం జరిగిందంటే.. వీడియో చూస్తే షాకవుతారు!
Viral Video
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 16, 2021 | 10:56 AM

అడవిలో జీవనం సాహసాలతో నిండి ఉంటుంది. ఎప్పుడూ బ్రతుకు పోరాటం చెయ్యక తప్పదు. బలం, తెలివి, వ్యూహం లేకపోతే క్రూర జంతువులకు ఆహారం కాక తప్పదు. సింహం, చిరుత, పులి వేట ఒక ఎత్తయితే.. హైనాల వేట మరో ఎత్తు.

ఒకరకంగా చెప్పాలంటే హైనాలు సర్వభక్షకాలు. ఇతర జంతువులను గుంపుగా వేటాడి చంపి తింటాయి. సజీవంగా ఉన్న జంతువునైనా.. క్రూర జంతువుల ఆహారాన్ని అయినా లాక్కునేందుకు… హైనాలు గుంపుగానే ఎటాక్ చేస్తాయి. తాజాగా ఓ అడవి దున్నపై హైనాల గుంపు ఎటాక్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఓ అడవి దున్న కొలనులోకి దిగి నీరు తాగుతున్నట్లు మీరు వైరల్ వీడియోలో చూడవచ్చు. ఇంతలో హైనాల గుంపు దాన్ని దూరం నుంచి చూసి అక్కడికి చేరుకుంటుంది. పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టిన అడవి దున్న.. వాటితో యుద్దానికి దిగుతుంది. కాసేపు పోరు సాగిస్తుంది. అయితే ప్రయోజనం ఏమి ఉండదు. హైనాలు దాన్ని చుట్టుముట్టి మట్టుబెట్టాయి. ఈ భీకర పోరులో చివరికి విజేతలుగా నిలిచాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. హైనాల వేటను చూసి నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు.

Also Read:

జింకను వేటాడేందుకు నక్కిన చిరుత.. చివరికి షాకింగ్ సీన్.. వీడియో చూస్తే షాకవుతారు!

చాణక్య నీతి: ఈ మూడు అలవాట్లు ఉంటే.. యువత జీవితం నాశనం అయినట్లే.. అవేంటంటే.!

 ఈ ఫోటోలో పులి దాగుంది.. మీరు గుర్తించగలరా.? ఈజీగా కనిపెట్టొచ్చు చూడండి.!

ఎనిమిదో స్థానంలో సుడిగాలి ఇన్నింగ్స్.. టీమిండియాకు సూపర్ విక్టరీ.. గెలిపించిన బెస్ట్ ఆల్‌రౌండర్!