Viral Video: త్రివర్ణ పతాకంలో ఐదు రంగులన్న స్టూడెంట్.. ఆన్సర్ వింటే కన్నీరాగదు.. వీడియో వైరల్

ఒక స్టూడెంట్, అతని ఉపాధ్యాయుడి మధ్య జరిగిన సంభాషణతో ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు భావోద్వేగానికి గురయ్యారు. వైరల్ అవుతున్న వీడియోలో మన త్రివర్ణ పతాకంలో ఎన్ని రంగులు ఉన్నాయని ఒక టీచర్.. స్టూడెంట్ ని అడిగాడు. అప్పుడు ఆ స్టూడెంట్ ఐదు రంగులు అని చెప్పాడు. తర్వాత ఆ రంగులు ఏమిటో చెప్పిన సమాధానం విని ప్రజలు భావోద్వేగానికి గురయ్యారు. కన్నీరు పెట్టుకుంటున్నారు.

Viral Video: త్రివర్ణ పతాకంలో ఐదు రంగులన్న స్టూడెంట్.. ఆన్సర్ వింటే కన్నీరాగదు.. వీడియో వైరల్
Viral Video
Image Credit source: X/@Poojab1177

Updated on: May 13, 2025 | 1:42 PM

భారత జాతీయ జెండా త్రివర్ణ పతాకంలో ఎన్ని రంగులు ఉంటాయి? సహజంగానే.. ఇది కూడా తెలియదా.. అని అనుకుంటున్నారా.. అయితే ఈ ప్రశ్నకు ఒక చిన్న పిల్లవాడు చెప్పిన సమాధానం విని నెటిజన్లు భావోద్వేగానికి గురయ్యారు. ఉపాధ్యాయుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ఆ పిల్లవాడు త్రివర్ణ పతాకంలో మూడు కాదు, ఐదు రంగులు ఉన్నాయని జవాబిచ్చాడు. అంతేకాదు ఈ రంగులు ఏమిటో స్టూడెంట్ చెప్పిన సమాధానం విన్న తర్వాత భావోద్వేగానికి గురవుతారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులను జాతీయ జెండా అయిన త్రివర్ణ పతాకంలో ఎన్ని రంగులు ఉన్నాయి అని అడుగుతున్నట్లు చూడవచ్చు. దీనికి పిల్లలందరూ ఒకే గొంతుతో.. సార్.. మూడు రంగులు అని సమాధానం ఇచ్చారు. అయితే ఒక పిల్లవాడు 5 రంగులు అని చెప్పి గురువును గందరగోళానికి గురిచేశాడు.

ఇవి కూడా చదవండి

టీచర్ ఆ పిల్లవాడి మీద కోపంతో ఇది కూడా తెలియదా.. “ఇదంతా నా ట్యూషన్ కి రాకపోవడం వల్లే జరిగింది” అని చెప్పాడు. టీచర్ చెప్పిన తీరుతో పిల్లలందరూ నవ్వడం ప్రారంభించారు. అప్పుడు టీచర్ పిల్లలను శాంతింపజేసి.. ఆ స్టూడెంట్ ని జాతీయ జెండాలో ఏ 5 రంగులను చూశావు అని అడిగాడు.

అప్పుడు ఆ స్టూడెంట్ మొదట రంగు కుంకుమ పువ్వు, రెండవ రంగు తెలుపు, మూడవ రంగు ఆకుపచ్చ , నాల్గవ రంగు నీలం రంగు ఇది అశోక చక్రం అని చెప్పాడు. అప్పుడు టీచర్ తో పాటు మిగిలిన స్టూడెంట్స్ ఐదవ రంగు ఏమిటి అని అడిగారు. అప్పుడు చిన్నారి బాలుడు ఐదవ రంగు ఎరుపు రంగు సార్ అని చెప్పాడు.

అవును తాను చివరిసారిగా తన నాన్నని చూసినప్పుడు త్రివర్ణ పతాకం చుట్టుకుని ఉన్నారు. అప్పుడు ఆ త్రివర్ణ పతకం మీద ఎరుపు రంగు కూడా కనిపించింది. అది నాన్న రక్తం అని చెప్పిన పిల్లవాడి సమాధానం విన్న తర్వాత టీచర్ తో భావోద్వేగానికి గురయ్యాడు.

ప్రజల హృదయాలను తాకిన వీడియోను ఇక్కడ చూడండి.

ఈ వీడియోను @Poojab1177 అనే ఖాతాలోని Instagramలో షేర్ చేశారు. దీనిని ఇప్పటివరకు వేలాది మంది వీక్షించారు. వందల మంది రీట్వీట్ చేశారు. వివిధ రకాల కామెంట్స్ చేస్తూ ప్రజలు భావోద్వేగానికి గురవుతున్నారు. ఈ వీడియో హృదయాన్ని తాకిందని ఒకరు రాశారు. ఇది చూసి నేను ఏడుపు ఆపుకోలేకపోయాను మరొకరు కామెంట్ చేశారు. కళ్ళు తడి అయ్యాయి అని ఇది విన్న తరవాత తనకు నోట మాట రాలేదని ఇంకొకరు.. మరో యూజర్, జై హింద్ అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

 

మరిన్ని టెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..