Viral video: ఇది ట్రాక్టరా..భూతమా! తనంతట తాను కదిలి.. షో రూమ్ అద్దాలు పగల గొట్టిన వీడియో వైరల్

ట్రాక్టర్ తనంతట తానుగా ఎలా స్టార్ట్ అయ్యిందో అస్పష్టంగా ఉంది. ఈ ఘటన మొత్తం షోరూమ్‌లోని సీసీటీవీలో రికార్డ్ అయింది. ఈ ఘటనపై పోలీసులకు షాప్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.

Viral video: ఇది ట్రాక్టరా..భూతమా! తనంతట తాను కదిలి.. షో రూమ్ అద్దాలు పగల గొట్టిన వీడియో వైరల్
Viral Video

Updated on: Mar 03, 2023 | 1:42 PM

సోషల్ మీడియాలో కనిపించే క్లిప్‌లు కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని వీడియోలు ఆసక్తిని కలిగిస్తాయి. ఇంకొన్ని వీడియోలు మనం ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించేలా చేస్తాయి. తాజాగా ఆగి ఉన్న ఓ ట్రాక్టర్.. హఠాత్తుగా కదలడం మొదలైంది. అంతేకాదు తన ప్రయాణానికి అడ్డుగా ఉన్న ఓ షాప్ అద్దాలను ఢీ కొట్టుకుంటూ వెళ్ళింది. సినిమాల్లో మాత్రమే కనిపించే ఈ వింత ఘటన సజీవ దృశ్యంగా ఉత్తర్ ప్రదేశ్ లో కనిపించింది. వివరాల్లోకి వెళ్తే..

ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో షోరూమ్ ముందు ఆగి ఉన్న ట్రాక్టర్ దానంతట అదే కదలడం ప్రారంభించిన వింత ఘటన చోటుచేసుకుంది. వైరల్ అవుతున్న వీడియోలో తన ప్రయాణానికి అడ్డు వస్తున్న.. ఓ స్టోర్‌లోని అద్దాలు, ఇతర వస్తువులను పగులగొట్టి  ప్రవేశించింది. దీంతో షూ షోరూమ్‌ అద్దాలు పగిలాయి. ఇది ఎవరికైనా చెబితే నమ్మరు.. కనుక వైరల్ అవుతున్న వీడియోపై ఓ లుక్ వేయండి..

ఇవి కూడా చదవండి

ట్రాక్టర్ తనంతట తానుగా ఎలా స్టార్ట్ అయ్యిందో అస్పష్టంగా ఉంది. ఈ ఘటన మొత్తం షోరూమ్‌లోని సీసీటీవీలో రికార్డ్ అయింది. ఈ ఘటనపై పోలీసులకు షాప్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.

ఈ సంఘటన సమాధాన్ దివస్‌ను నిర్వహిస్తున్న బిజ్నోర్ కొత్వాలి సిటీ పోలీస్ స్టేషన్ ముందు జరిగింది.  ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి కొందరు వ్యక్తులు కారు, ట్రాక్టర్‌తో పోలీస్ స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. కిషన్ కుమార్ అనే వ్యక్తి తన ట్రాక్టర్‌ను చెప్పుల దుకాణం ముందు నిలిపాడు. అకస్మాత్తుగా  ట్రాక్టర్‌ తనంతట తానుగా స్టార్ట్ అయి షూ షోరూమ్‌లోకి ప్రవేశించేలోపే ట్రాక్టర్ గంటపాటు కదలకుండా ఉండిపోయింది. ఈ ‘హాంటెడ్’ క్లిప్ సోషల్ మీడియాలో పిచ్చిగా వైరల్ అయింది. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

ట్రాక్టర్ లో దెయ్యం ఉందేమిటి అని ఒకరు కామెంట్ చేస్తే.. మరొకరు ఇది భయంకరంగా ఉందని అన్నారు. మరొకరు నేను చూస్తుంది నిజమేనా omg  నేను చాలా భయపడ్డానని కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..