Watch: గొలుసు దొంగను పట్టుకునేందుకు ఏకంగా బస్సుతో ఢీకొట్టిన డ్రైవర్‌..! ఆ తర్వాత జరిగిందో చూస్తే..

|

May 30, 2024 | 12:55 PM

చైన్ స్నాచింగ్ లకు పాల్పడిన దుండగులు ప్రాణాల కోసం పరుగెడుతూ ప్రమాదాల బారిన పడుతున్న సంఘటనలు కూడా అనేకం వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన హర్యానాలో వెలుగుచూసింది. హర్యానా రోడ్‌వేస్ బస్సు డ్రైవర్ వేగంగా స్పందించి దోపిడీని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన కెమెరాకు చిక్కగా, వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

Watch: గొలుసు దొంగను పట్టుకునేందుకు ఏకంగా బస్సుతో ఢీకొట్టిన డ్రైవర్‌..! ఆ తర్వాత జరిగిందో చూస్తే..
Snatching
Follow us on

పెరుగుతున్న బంగారం ధరల ప్రభావంతో దేశంలో చైన్ స్నాచింగ్‌ల ఘటనలు భారీగా పెరిగాయి. చైన్-స్నాచింగ్ కేసుల సంఖ్య పెరగడానికి దోహదపడిన ఇతర అంశాలు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం. చైన్ స్నాచింగ్ లకు పాల్పడిన దుండగులు ప్రాణాల కోసం పరుగెడుతూ ప్రమాదాల బారిన పడుతున్న సంఘటనలు కూడా అనేకం వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన హర్యానాలో వెలుగుచూసింది. హర్యానా రోడ్‌వేస్ బస్సు డ్రైవర్ వేగంగా స్పందించి దోపిడీని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన కెమెరాకు చిక్కగా, వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

దొంగతనాలు చేసేందుకు ముందుగానే దొంగలు ప్లాన్ చేసి చోరీ చేస్తారని అంటారు. ఎందుకంటే దొంగతనం చేస్తూ పట్టుబడతామోననే భయం. అలా జరిగితే బహిరంగ ప్రదేశంలోనే ముందుగా స్థానికుల చేతిలోనే చావు దెబ్బలు తినాల్సి వస్తుంది. అనంతరం ఆ దొంగను పట్టుకుని చిత్తకొట్టి పోలీసులకు అప్పగిస్తారు. ఈరోజు సోషల్ మీడియాలో కూడా అలాంటిదే కనిపించింది. ఓ బస్సు డ్రైవర్ చాకచక్యంగ దొంగలను పట్టుకునేందుకు దోహదపడింది. దొంగను పట్టుకోవడానికి బస్సు డ్రైవర్ చేసిన చిత్ర శైలి చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

హర్యానాలో ఒక మహిళ నుండి గొలుసు లాక్కొని స్నాచర్లు తప్పించుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే హర్యానా రోడ్‌వేస్ డ్రైవర్ బస్సు ఆ దొంగను గమనించి దోపిడీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దూరం నుంచి చోరీ సంఘటనను పసిగట్టిన బస్సు డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించాడు. బస్సుతో నేరుగా ఆ దొంగలు పారిపోతున్న బైక్‌ను ఢీకొట్టాడు. దాంతో ఆ ఇద్దరు దొంగలు కిందపడిపోయారు. ఇంతలో స్థానికులు పరిగెత్తుకుంటూ వచ్చి వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..