
అప్పుడప్పుడు, మానవత్వం, ప్రేమానురాగాలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తాయి. ఈసారి, వైరల్ వీడియో సినిమాలోని దృశ్యం కాదు, లక్షలాది మందిని కదిలించిన నిజ జీవిత క్షణం..! ఒక చిన్న పిల్లవాడు, తన గర్భవతి అయిన తల్లి నొప్పితో బాధపడుతుండటం చూసి, ఆమె దగ్గరకు వచ్చి, ఆమె కడుపుని ప్రేమగా లాలించి, ఆపై ఆమెను దుప్పటితో కప్పాడు. ఆ దృశ్యం చూసిన తర్వాత ప్రతి ఒక్కరి హృదయం చలించక మానదు. సోషల్ మీడియాలో ప్రజలు, “అది బిడ్డ కాదు, ఇది మాతృత్వం, అత్యంత అందమైన రూపం” అని అంటున్నారు.
వైరల్ వీడియోలో, ఒక మహిళ సోఫాలో పడుకుని, అలసిపోయినట్లు లేదా నొప్పితో ఉన్నట్లు కనిపించింది. ఆమె గర్భవతి అయి ఉండవచ్చు. బహుశా ఆమె బాగా అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. అప్పుడే, ఆమె చిన్న కొడుకు నెమ్మదిగా ఆమె దగ్గరకు వచ్చాడు. ముందుగా ఆమె కడుపుని ప్రేమగా తాకుతూ, రాబోయే సోదరుడు లేదా సోదరితో మాట్లాడుతున్నట్లుగా, ఆమె కడుపుపై ముద్దు పెట్టాడు. ఆపై సమీపంలోని దుప్పటిని తీసుకొని ఆమెను వెచ్చగా ఉంచడానికి దానితో కప్పాడు. ఈ క్షణం వీడియోలో చాలా సహజంగా నిజాయితీగా కనిపించింది. ఇది చూసే ప్రతి ఒక్కరికీ చిరునవ్వుతోపాటు కన్నీళ్లను తెప్పించింది. పిల్లల ముఖం అమాయకత్వం,ఆప్యాయత నిండి ఉంటుంది. వారు చూపే ప్రేమ నిస్వార్థంతో కూడి ఉంటుంది. ముఖ్యంగా తల్లి, కొడుకు మధ్య ఎటువంటి భేషజాలు లేని నిజమైన సంబంధాన్ని మరోసారి గుర్తు చేస్తుంది.
ఈ వీడియోను @Brink_Thinker అనే ఖాతా ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు లక్షలాది మంది వీక్షించారు. ఇది ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.
వీడియో చూడండి..
This little guy sweetly covers his pregnant mom with a blanket as she falls asleep on the sofa😘
— Kevin W. (@Brink_Thinker) October 6, 2025
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..