AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పాపం అమ్మాయిలు.. స్టంట్ చేయాలనుకున్నారు.. అదుపుతప్పి బొక్కబోర్లా పడ్డారు.. వీడియో

Girls stunt video: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. అయితే.. ఇలాంటి వీడియోల్లో

Viral Video: పాపం అమ్మాయిలు.. స్టంట్ చేయాలనుకున్నారు.. అదుపుతప్పి బొక్కబోర్లా పడ్డారు.. వీడియో
Girls Stunt
Shaik Madar Saheb
|

Updated on: Dec 14, 2021 | 8:55 PM

Share

Girls stunt video: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. అయితే.. ఇలాంటి వీడియోల్లో బైక్ స్టంట్లకు సంబంధించినవి కూడా వైరల్ అవుతుంటాయి. అయితే.. కొంతమంది అనతి కాలంలో ట్రెండ్ కావడానికి, పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి కొన్ని స్టంట్లు చేస్తుంటారు. స్టంట్స్ అనేవి ప్రొఫెషనల్ గా చేయాల్సినవి అయినప్పటికీ.. తమ వీడియోలు, ఫోటోలకు లైక్‌లు, కామెంట్‌లు రావాలనే కోరికతో వారు కొంతమంది విన్యాసాలు చేసి బొక్కబోర్లా పడుతుంటారు. అందరినీ ఆశ్చర్యం కలిగించాలని.. వారే ప్రమాదంలో పడతారు. అయితే.. తాజాగా… వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు అమ్మాయిలు బైక్‌లపై ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ కిందపడ్డారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న వీడియోలో.. ఇద్దరు అమ్మాయిలు బైక్‌పై విన్యాసాలు చూపించడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే ఈ సమయంలో వారిద్దరూ ప్రమాదంలో పడతారు. వీడియో ప్రారంభంలో చూస్తుంటే.. ఇద్దరమ్మాయిలు ఏదో విన్యాసం చేస్తారనుకుంటారు. యువతి.. బైక్‌తో విన్యాసాలు చేస్తున్న క్రమంలో కిందపడతారు. ఈ దృశ్యం నిజంగా భయానకంగా ఉంది. స్పోర్ట్స్ బైక్‌పై వెనుక కూర్చున్న అమ్మాయి బైక్ ముందు చక్రాన్ని గాలిలో లేపుతుంది. ఈ క్రమంలో ముందు ఉన్న యువతి బ్యాలెన్స్ తప్పుతుంది. దీంతో ఇద్దరు పడిపోతారు. అయితే.. మీరు ఎప్పుడూ ఇలాంటి స్టంట్ చేయడానికి ప్రయత్నించవద్దంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను చూడండి..

వైరల్ వీడియో..

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో natural_beautiful007 యూజర్ షేర్ చేశారు. నవంబర్ 25న షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు నాలుగు లక్షల మంది లైక్ చేశారు. బైక్ స్టంట్ వీడియోను నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియో ఎక్కడిది అనేది తెలియరాలేదు. స్టంట్లు జాగ్రత్తగా చేయాలంటూ పలువురు నెటిజన్లు సూచిస్తుండగా.. మరికొందరు సాధ్యమైనంతవరకూ ఇలాంటి వాటికి దూరంగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు.

Also Read: Haiti Gas Tanker Explosion: ఘోర ప్రమాదం.. గ్యాస్ ట్యాంకర్ పేలి 50 మంది దుర్మరణం..

Viral Video: రూ.2 కోట్లు విలువ చేసే ఇంటిని రూ.100కే అమ్మేస్తున్నారు !! వీడియో