Viral Video: సోషల్ మీడియాలో రోజుకో ఫన్నీ వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఆ వీడియోలు చూస్తే చాలా సార్లు నవ్వు వస్తుంది. కొన్ని వీడియోలు చూస్తుంటే.. ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి షాకింగ్ వీడియో ఒకటి ఇటీవలి కాలంలో చర్చనీయాంశంగా మారింది. ఇందులో చేపలు రోడ్డుపై ఈత కొడుతూ కనిపిస్తున్నాయి. చెరువులు, నదుల్లో ఈత కొట్టే జీవి రోడ్డుపైకి ఎలా వస్తుందని ఆశ్చర్యానికి లోనవుతారు. అయితే ఇది పూర్తిగా నిజం. ఈ షాకింగ్ ఉదంతం గౌహతిలో జరిగింది. రోడ్డుపై వాహనాలు లేని చోట చేపలు మాత్రం హడావుడిగా అటు ఇటూ కదులుతూ సందడి చేస్తున్నాయి.
వైరల్ అవుతున్న వీడియోలో.. వర్షం కారణంగా రహదారి నదిని తలిపిస్తుంది. దీంతో ఆ నీటిలో ఎక్కడ చూసిన చేపలు ఆనందంగా ఈత కొడుతున్నాయి. ఈ క్లిప్‌ని చూసిన జనాలు ఇది వాస్తవమో, కలమో అని తమ కళ్లను తామే నమ్మలేకపోతున్నారు..!
#Fishes on the roads of #Guwahati ? pic.twitter.com/T5t41msPLZ
— Rupin Sharma (@rupin1992) June 15, 2022
ఈ వీడియోను ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ తన ట్విట్టర్ హ్యాండిల్ లో షేర్ చేశారు. ఈ వీడియో 28 వేల మందికి పైగా వీక్షించగా.. వందలాది మంది సరదాగా కామెంట్ చేశారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. చేపలు చాలా సంతోషంగా రోడ్డుపై తేలియాడుతున్నాయని.. నిజంగా అద్భుతమైనదని ఒక వినియోగదారు కామెంట్ చేశాడు. మరొక వినియోగదారు వీడియోను చూసిన తర్వాత నేను ఈ సంవత్సరం చూసిన ఉత్తమ విషయం.. ఆహ్లదాన్ని ఇస్తుందని అన్నారు. ఈ దృశ్యం…. ఎంత అద్భుతం..ఇది కేవలం భారతదేశంలోనే జరుగుతుందని మరికొందరు పేర్కొన్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..