Watch: వావ్‌.. ఈ రైతు ఐడియా అదుర్స్‌.. ఒక్క ఉపాయంతో కూలీల ఖ‌ర్చు, సమయం రెండూ ఆదా..

|

May 26, 2023 | 2:48 PM

కొన్నిసార్లు కొందరు కారును హెలికాప్టర్‌గా మార్చేస్తే.. మరికొన్నిసార్లు కొందరు కుండలతో ఏసీకి మించిన చల్లిని పంటే ఎయిర్‌ కూలర్‌ను తయారు చేస్తారు. ఇప్పుడు అలాంటి దేశీ జుగాడ్‌కు సంబంధించిన మరో వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. 10 మంది చేసే పని ఇప్పుడు ఇద్దరు రైతులు ఈజీగా చేసుకునేలా ప్రత్యేక పరికరాన్ని తయారు చేశాడు.

Watch: వావ్‌.. ఈ రైతు ఐడియా అదుర్స్‌.. ఒక్క ఉపాయంతో కూలీల ఖ‌ర్చు, సమయం రెండూ ఆదా..
Unique Plantation Hack
Follow us on

పట్నం నుంచి పల్లెల వరకు దేశంలోని ప్రతి మూల ప్రతిభావంతులైన వ్యక్తులు ఎందరో ఉంటారు. సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఏదో ఒక జుగాడ్ వీడియోను చూడడానికి అలాంటి వాళ్ల తెలివితేటలే కారణం. సోషల్ మీడియాలో ఎప్పుడు, ఏది వైరల్ అవుతుందో ఎవరూ ఊహించలేరు. కొన్నిసార్లు కొందరు కారును హెలికాప్టర్‌గా మార్చేస్తే.. మరికొన్నిసార్లు కొందరు కుండలతో ఏసీకి మించిన చల్లిని పంటే ఎయిర్‌ కూలర్‌ను తయారు చేస్తారు. ఇప్పుడు అలాంటి దేశీ జుగాడ్‌కు సంబంధించిన మరో వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. పొలంలో మొక్కలు నాటేందుకు ప్రత్యేక యంత్రాన్ని తయారు. ఈ జుగాడ్‌ యంత్రంతో 10 మంది చేసే పని ఇప్పుడు ఇద్దరు రైతులు ఈజీగా చేసుకునేలా ఈ పరికరాన్ని తయారు చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్‌ వీడియోలో పొలంలో ఓ రైతు మొక్కలు నాటుతున్న దృశ్యం కనిపిస్తుంది. అయితే ఈ పనుల కోసం పొలాల్లో కూలీలు మాత్రం కనిపించడం లేదు. సాధారణంగా ఒక పొలంలో విత్తనాలు నాటడానికి నలుగురైదుగురు కూలీలైన తప్పనిసరిగా కావాల్సి ఉంటుంది. రైతు తయారు చేసిన ఈ యంత్రంతో పని చాలా సులువుగా లాభదాయకంగా మారింది. అతను పార, పలుగు లేకుండానే గొతులు తవ్వి మొక్కలు నాటేస్తున్నాడు. ఇందుకోసం భూమిని సక్రమంగా దున్నితే చాలు. ఈ జుగాడ్‌ యంత్రంతో మొక్కలు నాటేందుకు కావాల్సిన సమయం, పనిభారం తగ్గిపోతుంది. ఈ ఒక్క యంత్రం ఉంటే చాలు..రైతులకు సమయం, డబ్బు కూడా ఆదా అవుతుంది. కూలీల కోసం వెతకాల్సిన అవసరం ఉండదు. మొక్కలు నాటే క్రమంలో ఒక నిర్ధిష్ట దూరంలో ఒకే వరుసలో మొక్కలు నాటుకోవచ్చు. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ జుగాద్ వీడియో ఇప్పుడు యూజర్ల దృష్టిని ఎంతగానో ఆకర్షిస్తోంది. వైరల్ అవుతున్న జుగాడ్‌ వీడియోలో రైతు పొలంలో మొక్కలు నాటుతున్న తీరు చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియోలో ఓ వ్యక్తి చేతిలో ఇనుప రాడ్ లాంటిది పట్టుకుని ఉన్నాడు. ఇది తాడు, కర్ర సహాయంతో తయారు చేయబడింది. దాని కింద రెండు వైపులా తెరుచుకునేలా కోన్ ఆకారంలో ఉన్న ఒక యంత్రం ఉంది. అప్పుడు ఒక వ్యక్తి పరికరాన్ని మట్టిలోకి చొప్పించాడు. మరొక వ్యక్తి మొక్కను ఒక్కొక్కటిగా ఆ కోన్ లోపల వేస్తున్నాడు. కోన్‌లాంటి యంత్రాన్ని బాగా దున్ని పెట్టుకున్న నేలలో చొప్పించి బయటకు తీసినప్పుడు ఆ మొక్క భూమిలో నాటబడుతుంది. ఇలా ఇద్దరూ కలిసి కొద్ది సమయంలో పొల్లం నిండా కావాల్సినన్ని మొక్కలు నాటేశారు.

ఈ వీడియోను @TheFigen_ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు లక్షల మంది వీక్షించారు. చాలా మంది వినియోగదారులు ఈ యంత్రాన్ని తయారు చేసిన వ్యక్తిని ఎంతగానో ప్రశంసిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..