Viral Video: జేసీబీపై దాడిచేసిన ఏనుగు.. చివరకు గెలిచింది ఎవరో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..

ఏనుగు దగ్గరకు రావడం చూసి డ్రైవర్ JCB ముందు భాగాన్ని పైకి లేపాడు. ఏనుగు తన తొండంతో  శక్తివంతంగా దాడి చేస్తుంది. ఏనుగు బలానికి ఆ మొత్తం JCB షేక్ అవుతుంది. ఏనుగు తొండంతో నెడితే.. ఏకంగా JCBవాహనం పైకి లేస్తుంది.. చుట్టూ దట్టమైన దుమ్ము లేచింది. అయిన ఆ డ్రైవర్ భయపడలేదు.. ధైర్యంగా ఏనుగును బెదిరంచే ప్రయత్నం చేశాడు.. కానీ, అంతలోనే..

Viral Video: జేసీబీపై దాడిచేసిన ఏనుగు.. చివరకు గెలిచింది ఎవరో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..
Jcb Vs Elephant

Updated on: Feb 05, 2025 | 2:36 PM

ఏనుగులు స్వతహాగా చాలా ప్రశాంతంగా ఉంటాయి. కానీ, చాలా మంది ఏనుగుల ముందు వెళ్లడానికి భయపడతారు. అడవులకు సమీపంలో నివసించే గ్రామస్తులను తరచూ ఏనుగులు ఆందోళన కలిగిస్తుంటాయి.. అవి పొలాల్లోకి వచ్చి పంటలను నాశనం చేస్తాయి. అందువల్ల, అడవులకు దగ్గర ప్రాంతాలలో మానవులకు, జంతువులకు మధ్య ఘర్షణలు తరచుగా జరుగుతాయి. ఏనుగులు పొలాలు, తోటలలోకి ప్రవేశించే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఏనుగు, జేసీబీ మధ్య జరిగిన ఘర్షణ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్ వీడియోలో, ఒక ఏనుగు JCB పై తీవ్రంగా దాడి చేయడానికి ప్రయత్నిస్తోంది.. ఏనుగు దగ్గరకు రావడం చూసి డ్రైవర్ JCB ముందు భాగాన్ని పైకి లేపాడు. ఏనుగు తన తొండంతో  శక్తివంతంగా దాడి చేస్తుంది. ఏనుగు బలానికి ఆ మొత్తం JCB షేక్ అవుతుంది. ఏనుగు తొండంతో నెడితే.. ఏకంగా JCBవాహనం పైకి లేస్తుంది.. చుట్టూ దట్టమైన దుమ్ము లేచింది. అయిన ఆ డ్రైవర్ భయపడలేదు.. ధైర్యంగా ఏనుగును బెదిరంచే ప్రయత్నం చేశాడు.. దాంతో ఏనుగు వెనక్కి వెళ్లి తన దారిన తాను వెళ్ళిపోతుంది. కానీ డ్రైవర్ ఇక్కడ ఆగకుండా ఏనుగును వెంబడిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఊహించలేరు.

ఇవి కూడా చదవండి

ఈ వైరల్ వీడియో @sujandutta.pc._lover_ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయబడింది. ఈ వీడియోను JCV Vs ఎలిఫెంట్ అనే టైటిల్ తో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు 4.1 లక్షలకు పైగా లైక్‌లు, కామెంట్స్ వచ్చాయి. అటవీ శాఖ, సంబంధిత అధికారులు జేసీబీ డ్రైవర్ పై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కొంతమంది నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ కామెంట్‌కు చాలా మంది మద్దతు తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..