Duck In Marathon: మారథాన్‌లో పాల్గొన్న బాతు.. చూస్తే ఫిదాఅవుతారు..!

Viral Video: ఇటీవల కాలంలో మనుషుల మాదిరిగానే తాము కూడా అన్ని చేయగలమంటున్నాయి జంతువులు, పక్షులు..అవి ఎలా మనుషుల్ని అనుకరిస్తున్నాయో

Duck In Marathon: మారథాన్‌లో పాల్గొన్న బాతు.. చూస్తే ఫిదాఅవుతారు..!
Duck Running

Updated on: May 06, 2022 | 8:40 AM

Viral Video: ఇటీవల కాలంలో మనుషుల మాదిరిగానే తాము కూడా అన్ని చేయగలమంటున్నాయి జంతువులు, పక్షులు..అవి ఎలా మనుషుల్ని అనుకరిస్తున్నాయో సోషల్‌ మీడియాలో అనేక వీడియోల ద్వారా వైరల్‌ అవుతున్నాయి. అచ్చం అలానే ఇక్కడొక బాతు తాను సైతం అంటూ మారథాన్‌లో పాల్గొని మరోసారి మెడల్‌ గెలుచుకుంది. పైగా మారథాన్‌లో మెడల్ గెలవటం ఈ బాతుకు ఇది రెండోసారి కూడాను..

సుదీర్ఘంగా సాగే పరుగు పందాలనే ‘మారథాన్’ అంటారు. పరుగెత్తుతూ లేదా వేగంగా నడుస్తూ ఈ రేస్‌లను పూర్తి చేస్తుంటారు. ఇక బిగ్ మారథాన్స్‌లో అయితే పదివేల మందికి పైగా పాల్గొంటారు. న్యూయార్క్‌లో మారథాన్‌ జరుగుతుండగా.. ఒక బాతు అందరి దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే ఇది మామూలు బాతు కాదు..సెలబ్రిటీ బాతు. దీనికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఎందుకంటే, రింకిల్‌ గతేడాది కూడా న్యూయార్క్ మారథాన్ రేస్‌లో పాల్గొంది. మెడల్ గెలుచుకుంది. తాజాగా మరోమారు ఇప్పుడు జరిగిన లాంగ్ ఐలాండ్ మారథాన్‌లో ప్రత్యేక అతిథిగా పాల్గొంది. వందల మంది పరుగులు పెడుతుంటే.. తనకు కేటాయించిన ప్రత్యేక రూట్‌లో ఆ బాతు కూడా పరుగులు పెట్టింది. కాళ్లకు ఎర్రటి షూస్ ధరించి దూసుకెళ్లింది. చివర్లో మిగతా వాళ్లతో పోటీ పడుతూ.. రెక్కలు ఊపి మరీ వేగంగా వెళ్లింది. దాంతో దాని మెడలో ప్రత్యేక మెడల్‌ వేశారు. ఈ బాతు వీడియోలు ఫన్నీగా, సరదాగా ఉండటంతో.. పిల్లలకు, పెద్దవాళ్లకూ ఇది బాగా నచ్చింది. ఇది పాటలకు డాన్స్ వేస్తుంది, రీమిక్స్ చేస్తుంది, అల్లరి చేస్తుంది. అందువల్ల ఈ బాతుకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది.

ఇవి కూడా చదవండి