Viral Video: పాపం చిన్నది.. అటు బాతు, ఇటు కోడి.. దెబ్బకు బేరుమన్నది.. వీడియో చూస్తే..

Viral Video: సాధారణంగా ప్రజలు తమ ఇళ్లలో బాతులు, కోళ్లను ఎక్కువగా పెంచుకుంటారు. వాటిని ప్రేమగా సాకుతారు. అదే సమయంలో ఏదైనా పండుగ పబ్బాలకు వాటిని వండుకుని

Viral Video: పాపం చిన్నది.. అటు బాతు, ఇటు కోడి.. దెబ్బకు బేరుమన్నది.. వీడియో చూస్తే..
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 05, 2022 | 2:11 PM

Viral Video: సాధారణంగా ప్రజలు తమ ఇళ్లలో బాతులు, కోళ్లను ఎక్కువగా పెంచుకుంటారు. వాటిని ప్రేమగా సాకుతారు. అదే సమయంలో ఏదైనా పండుగ పబ్బాలకు వాటిని వండుకుని కూడా తింటారు. అది వేరే విషయం అనుకోండి. అయితే, కోళ్లు, బాతులు సహజంగా ఎవరి జోలికి వెళ్లవు. కాని వాటికి కోపం వస్తే మాత్రం ఊరుకోవు. ముక్కుతో, కాలి గోళ్లతో దాడి చేస్తాయి. అవి దాడి చేయడం మొదలు పెడితే తట్టుకోవడం కూడా కష్టమే అని చెప్పాలి. అయితే, ఓ యువతి కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంది. ఓ వైపు బాతు, మరో వైపు కోడిపుంజు రెండూ కలిసి యువతికి చుక్కలు చూపించాయి. అవి చేసిన దాడికి తట్టుకోలేక ఆ యువతి బోరున విలపించింది. వాటి నుంచి తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ వైరల్ వీడియోలో.. ఇంటి ముందున్న పెరట్లో కోళ్లు, బాతులు మేత మేస్తున్నాయి. ఇంతలో ఓ యువతి ఇంట్లోకి వెళ్లేందుకు వాటి మధ్యం నుంచి నడుచుకుంటూ వెళ్తోంది. మరి ఆ యువతిని చూస్తే బాతుకు ఏమనిపించిందో ఏమోగానీ.. ఆమెపై అటాక్ చేసింది. తన పదునైన ముక్కుతో యువతి కాలిని కొరికేసింది. ఈ ఊహించని దాడితో యువతి హడలిపోయింది. బాతును వెళ్లగొట్టే ప్రయత్నం చేసింది. ఇంతలో వెనుకవైపు నుంచి కోడి పుంజు వచ్చింది. ఆ కోడి పుంజు కూడా యువతిపై అటాక్ చేసింది. ఇటు నుంచి బాతు, అటు నుంచి కోడిపుంజు ఏకకాలంలో దాడి చేయడంతో యువతి బెంబేలెత్తింది. అవి పొడుస్తుంటే.. తట్టుకోలేక విలపించింది. భయంతో అక్కడి నుంచి పరుగులు తీసింది. కాగా, ఈ ఫన్నీ వీడియోను ఎర్త్ డిక్స్ అనే ఇన్‌స్టాగ్రమ్ ఐడీలో పోస్ట్ చేయగా.. అది వైరల్‌ అయ్యింది. ఈ వీడియోను నెటిజన్లు అమితంగా ఇష్టపడుతున్నారు. ఇప్పటి వరకు 11 మిలియన్లకు పైగా యూజర్లు ఈ వీడియోను వీక్షించారు. 2 లక్షలకు పైగా వ్యూస్ కూడా వచ్చాయి. ఇక నెటిజన్లు ఈ వీడియోపై తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.

Viral Video:

Also read:

Perni Nani vs RGV: వర్మ ప్రశ్నలకు పేర్ని నాని కౌంటర్ ఎటాక్.. ఏ చట్టం చెప్పిందంటూ..

Anupama Parameswaran: లవ్ బ్రేకప్ గురించి హీరోయిన్ ఓపెన్ కామెంట్స్.. కానీ.. ప్రేమను గుర్తుచేసుకోనంటూ..

 Bellamkonda Sreenivas : స్పీడ్ పెంచిన బెల్లం కొండ హీరో.. ఛత్రపతి హిందీ రీమేక్ టాకీ పార్ట్ పూర్తి

RGV On AP Govt. సినిమా టికెట్స్ వ్యవహారం.. ఏపీ ప్రభుత్వానికి పది ప్రశ్నలను సంధించిన రామ్ గోపాల్ వర్మ ..