
ఈ మధ్యకాలంలో ప్రేమ జంటలు రెచ్చిపోతున్నారు. ఇంతకాలం కాస్తో కూస్తో ప్రైవసీ ప్లేస్‌లలో రొమాన్స్ చేసేవారు. కానీ, రాను రాను బరితెగించి ప్రవర్తిస్తున్నారు. ఎంతలా అంటే, చుట్టూ జనాలు ఉన్నారనే విషయాన్నే మర్చిపోతున్నారు. కన్నూమిన్నూ కానక, కామంతో పెట్రేగిపోతున్నారు. ఇప్పటికే ఎంతోమంది లవర్స్ బైక్‌పై రొమాన్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండగా.. తాజాగా మరో షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అయిన ట్రైన్‌లో ఓ ప్రేమ జంట రెచ్చిపోయింది. అందరూ ఉన్నారనే సోయి కూడా లేకుండా.. రొమాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియో ప్రకారం.. ముంబైల్ లోకల్ ట్రైన్‌లో ఓ జంట బహిరంగంగా రొమాన్స్ చేస్తోంది. ట్రైన్ కంపార్ట్‌మెంట్‌లో చాలామంది ప్రయాణికులు ఉన్నారు. అయినప్పటికీ వారిని పట్టించుకోని ప్రేమ జంట.. బహిరంగంగానే రొమాన్ చేయడం ప్రారంభించారు. ఓవైపు అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు హత్తుకుని ముద్దులు పెట్టుకుంటూ రెచ్చిపోగా.. మరోవైపు అబ్బాయి ఒడిలో కూర్చుని అమ్మాయి రొమాన్స్ చేస్తోంది.
అయితే, వీరి గలీజ్ యవ్వారాన్ని తోటి ప్రయాణికులు తమ సెల్ ఫోన్ కెమెరాలో రికార్డ్ చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్వి్ట్టర్‌లో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. యువతీ, యువకుల చర్యను చూసి నెటజిన్లు షాక్ అవుతున్నారు. మరీ ఇంత బరితెగించారేంట్రా బాబూ అని విమర్శలు గుప్పిస్తున్నారు. ‘మీ దుంపలు తెగ.. అది పబ్లిక్ ట్రైన్ అనుకుంటున్నారా? ప్రైవేట్ రూమ్ అనుకుంటున్నారా?’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రజా సమూహంలో ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఉండాలంటే.. ఈ వీడియోలోని యువతీ యువకులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు.
public romance in mumbai local train santacruz to lower parel pic.twitter.com/CIeEQNb9sW
— Viral Baba (@user189876) March 22, 2023
మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..