Viral Video: ఈ రెండింటి స్నేహం అదుర్స్‌.. పిల్లిని ఆట పట్టించిన కుందేలు.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌

Cat- Rabbit Video Viral: సోషల్ మీడియా జంతువులకు సంబంధించిన ఫన్నీ వీడియోలు తెగ వైరల్‌ అవుతుంటాయి. మీరు ప్రతిరోజూ ఇలాంటి అనేక వీడియోలను సోషల్‌ మీడియాలో..

Viral Video: ఈ రెండింటి స్నేహం అదుర్స్‌.. పిల్లిని ఆట పట్టించిన కుందేలు.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌
Cat Rabbit Video Viral

Updated on: Aug 04, 2022 | 8:13 AM

Cat- Rabbit Video Viral: సోషల్ మీడియా జంతువులకు సంబంధించిన ఫన్నీ వీడియోలు తెగ వైరల్‌ అవుతుంటాయి. మీరు ప్రతిరోజూ ఇలాంటి అనేక వీడియోలను సోషల్‌ మీడియాలో చూస్తూనే ఉంటారు. ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అందులో పులులు, సింహాలు, మొసళ్లు, పాములు ఇలాంటి వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. కొన్ని వీడియోలు ఒళ్లు గగుర్పొడిచే వీడియోలు ఉంటే.. మరికొన్ని ఫన్నీగా ఉంటాయి. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వైరల్ వీడియోలో చిన్న పిల్లి, కుందేలును చూడవచ్చు. ఇవి రెండు కూడా క్యూట్‌గా కనిస్తున్నాయి. ఒకరినొకరు సరదాగా గడుపుతున్నాయి.

మంచం మీద చిన్న పిల్లి, అల్లరి కుందేలును చూసి నెటిజన్లు ఫన్నీగా అభివర్ణిస్తున్నారు. పిల్లి కుందేలును వెంబడించడంలో తెగ బిజీగా ఉంది. దానిని పట్టుకునేందుకు చుట్టు తిరుగుతుండగా, దానిని పట్టుకోలేకపోయింది.

ఇవి కూడా చదవండి

 


కుందేలు- పిల్లి స్నేహం

కుందేలు-పిల్లి మధ్య అద్భుతమైన స్నేహం ఉంది. రెండు వేర్వేరు జంతువుల మధ్య అలాంటి సంబంధం కనిపించడం అనేది చాలా అరుదు. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో బ్యూటెంగెబిడెన్ అనే ఖాతాతో షేర్‌ చేయబడింది. ఈ వీడియో ఇప్పటివరకు 3.5 మిలియన్‌ల మంది వీక్షించారు. సార్లు వీక్షించబడింది. లక్షకుపైగా లైక్స్‌ వచ్చాయి. ఎంతో మంది వారికి నచ్చినట్లుగా ఫన్నీగా కామెంట్లు చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి