Viral Video: ”ఓరినీ బిజీ తగలెయ్య.. చూసుకోవాలి కదరా బాబు”.. ఈ వీడియో చూస్తే మీరు తిట్టకుండా ఉండలేరు..

ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో పక్కన వల్లనే కాదు సొంతవాళ్లను కూడా పట్టించుకోవడం లేదు కొందరు. పక్కనోడు చచ్చిపోతున్న మన పని ముఖ్యం అంటూ చూసి చూడనట్టు వెళ్ళిపోయేవారు కోకొల్లలు..

Viral Video: ''ఓరినీ బిజీ తగలెయ్య.. చూసుకోవాలి కదరా బాబు''.. ఈ వీడియో చూస్తే మీరు తిట్టకుండా ఉండలేరు..
Child
Follow us

|

Updated on: Aug 03, 2022 | 6:11 PM

Viral Video: ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్‌లో పక్కన వల్లనే కాదు సొంతవాళ్లను కూడా పట్టించుకోవడం లేదు కొందరు. పక్కనోడు చచ్చిపోతున్న మన పని ముఖ్యం అంటూ చూసి చూడనట్టు వెళ్ళిపోయేవారు కోకొల్లలు.. అయితే ఎంత బిజీ లైఫ్ లో ఉన్న కనీసం మన సొంతం వాళ్ళు పెళ్ళాం పిల్ల పైన కాస్తయినా దృష్టి పెట్టాలి కదా.. మన పక్కన ఉన్నోడు ఉన్నాడో లేడో అని చూసుకునే సోయి కూడా ఉండదు కొందరికి. తాజాగా ఆలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెట్టింట వైరల్ అవుతోన్న ఈ వీడియో ఓ కారులో నుంచి ఈ చిన్న పాప పడిపోవడం మనం చూడొచ్చు.. రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉంటే సరిపోదు.. మన తో పాటు ఉన్న చిన్న పిల్లలను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి లేకుంటే ఇలాంటి ప్రమాదాలే జరుగుతుంటాయి.

తాజాగా వైరల్ అవుతోన్న ఈ వీడియోలో ఓ సిగ్నల్ దగ్గర చాలా కార్లు వచ్చి ఆగ్గాయి. అయితే ఓ కారులో నుంచి ఓ చిన్నారి తలను బయట పేటి చూస్తూ ఉంది. విండో గ్లాస్ దించి ఆ పాప బయటకు చూస్తూ ఉంది. ఇంతలో సిగ్నల్ పడటంతో ఆ కారు ముందుకు కదిలింది. ఒక్కసారిగా కారు కదలడంతో ఆ పాప విండో లోనుంచి బయటకు పడిపోయింది. కిందపడిపోయిన ఆ చిన్నారి లేవలేని పరిస్థితిలో ఉందిపోయింది. అయినా కూడా అతడు చూసుకోకుండా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వెనక ఉన్న కార్లలోనుంచి జనాలు దిగి ఆ పాపను పక్కకు తీసుకెళ్లారు.ఈ ఘటన అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి