పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం.. చాలా మంది తమ పెళ్లి గురించి అనేక కళలు కంటారు. అనేక విధాలుగా ఉహించుకుంటారు. ఎన్నో రోజుల నుంచి తమ జీవితంలోకి రాబోయే వారి గురించి… తదుపరి జీవితం గురించి ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. అలాగే.. పెళ్లి తర్వాత జీవితం గురించి ఎన్నేన్నో ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు.. పెళ్లితో వారి పూర్తి జీవితం మారిపోతుంది. వారి జీవనవిధానం… కుటుంబం.. అలవాట్లు.. ఒక్కటేమిటీ.. పూర్తిగా అమ్మాయి లైఫ్ మారిపోతుంది. అయితే తన జీవితంలోకి వచ్చే వరుడి గురించి… అతని ఆలోచనలు.. అలవాట్ల గురించి అమ్మాయిలకు అవగాహన మాత్రం ఉండదు. ఇప్పటికీ మన దేశంలో ఎంతో మంది స్త్రీలు… తమ జీవితంలోకి రాబోయే వ్యక్తి గుణగణాలు.. అలవాట్లు తెలుసుకోకుండానే వివాహం చేసుకుంటున్నారు. కానీ ఓ వధువు చేసిన పని ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో.. ఓ పెళ్లికూతురు.. వివాహానికి ముందే తనకు కాబోయే భర్తతో ఒప్పంద పత్రం పై సంతకం చేయించుకుంది. అందులో వరుడు.. ఏ పనులు చేయాలి.. ఎలాంటి పనులు చేయకూడదని తెల్చీ చెప్పింది. కరణ్.. హర్షల మధ్య ప్రేమ ఒప్పందం. ఇంతకీ ఆ అగ్రిమెంట్ పేపర్ లో ఏముందో తెలుసుకుందామా.
* రోజుకు కనీసం మూడు సార్లు అంతకంటే ఎక్కువసార్లు ఐ లవ్ యూ చెప్పాలి.
* నువ్వు లేకుండా బటర్ బోన్ లెస్ చికెన్ తినని వాగ్దానం చేయండి.
* మీ అమ్మ మీద ఒట్టు వేసి.. నమ్మకం ఎప్పుడూ పోగోట్టుకోవద్దు.
* మరణం వరకు ఒకరినొకరు ప్రేమించడం.. విలాసపరచడం.. గౌరవించడం.. ఉంటుందని వాగ్దానం చేయాలి.
ఇలాంటివి అనేక కండీషన్స్ ఉన్నాయి.
Also Read: Sitara Gattamaneni: సితారలో ఈ టాలెంట్ కూడా ఉందా ?.. ఏకంగా బుర్జ్ ఖలీఫానే..
Rashmi Gautham: క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించిన రష్మి.. తేలికగా ఆ మాటలు అనేస్తుంటారు అంటూ..
Bheemla Nayak: భీమ్లా నాయక్ సినిమాను అందుకే తొందరగా రిలీజ్ చేశారా ?.. క్లారిటీ ఇదేనా…
ET Movie Review: నారీలోకానికి అవగాహన కల్పించే ప్రయత్నం చేసిన ఈటీ!..