
Viral Video Petrol Pump: సామాజిక మాధ్యమాలలో ప్రతిరోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కానీ కొన్ని వీడియోలు చూసినప్పుడు నవ్వాలో, ఏడవాలో అర్థం కానంత విచిత్రంగా ఉంటాయి. తాజాగా ఒక యువకుడు పెట్రోల్ పంపు వద్ద నిల్చున్న ఇద్దరు అమ్మాయిలను చూస్తూ పూర్తిగా పరధ్యానంలో పడిపోయి చేసిన విన్యాసం ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. ఎచ్చులకు పోతే ఆ తర్వాత ఎలా పరిస్థితి ఎదురవుతుందో ఈ వైరల్ వీడియో నిరూపిస్తోంది.
ఈ వింత ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఒక యువకుడు తన మోటార్ సైకిల్‌పై పెట్రోల్ వేయించుకోవడానికి బంకులోకి వచ్చాడు. అంతవరకు అంతా బాగానే ఉంది. కానీ సరిగ్గా అదే సమయంలో ఇద్దరు అమ్మాయిలతోపాటు ఓ పిల్లాడు ఆ బంకు పక్కన నిల్చుని ఉన్నారు. వాళ్లకు సంబంధించిన వ్యక్తి బంకులో పెట్రోలో కొట్టించుకుంటుంటాడు. ఈ క్రమంలో అక్కడికి బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకుల చూపు పెట్రోల్ కొట్టించుకోవాల్సిన మెషిన్ వైపు కాకుండా ఆ యువతులవైపు మళ్లింది. వారిని చూస్తూ పూర్తిగా లోకాన్ని మరిచిపోయిన ఆ బైకర్, బైక్ యాక్సిలరేటర్‌ను ఒక్కసారిగా గట్టిగా తిప్పేశాడు.
ఇది కూడా చదవండి: Video: ఓపికను టెస్ట్ చేస్తే ఇలాగే ఉంటది.. బుడ్డోడి దూల తీరిపోయిందిగా.. ఇదిగో వీడియో
ये लौंडा दो लौंडिया को देखकर इतना जज्बाती हो गया है की
इसने मोटरसाइकिल को पेट्रोल पंप के उपर चढ़ा दिया आगे क्या हुआ विडियो में देखिए😳 pic.twitter.com/mmicxAhiQL
— Raksha Yatharth (@Rak_sha_2018) June 8, 2026
చూపు ఒకచోట, డ్రైవింగ్ మరోచోట ఉంటే ఇంకేమవుతుంది? ఊహించని విధంగా ఆ మోటార్ సైకిల్ పెట్రోల్ పోసే ప్రధాన ప్లాట్‌ఫామ్ పైకి అడ్డంగా దూసుకెళ్లిపోయింది. దీంతో అదే సమయంలో ఆ మహిళలకు సంబంధించిన వ్యక్తిపైకి పైకి దూసుకెళ్లింది. దీంతో ఇంకేముంది, దెబ్బలు గట్టిగానే తిన్నాడు. కేవలం 26 సెకన్ల నిడివి ఉన్న ఈ సీసీటీవీ క్లిప్‌లో ఆ దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బైక్ ముందు చక్రం కాస్తా పైకి లేచి, ఆ వేగానికి యువకుడు వాహనాన్ని నియంత్రించలేక తీవ్రంగా తడబడ్డాడు. ఈ హఠాత్ పరిణామానికి అక్కడ పెట్రోల్ కొడుతున్న సిబ్బందితో పాటు మిగతా వాహనదారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమ వేదికలపై విపరీతంగా హల్‌చల్ చేస్తోంది. ముఖ్యంగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాల హాస్యభరితమైన కామెంట్లు పెడుతున్నారు. “అమ్మాయిలను చూసిన ఆనందంలో తమ్ముడికి జోష్ ఎక్కువైంది, అందుకే నేరుగా బంకు పైకే ఎక్కించేశాడు” అంటూ కొందరు ఆటపట్టిస్తుంటే, “ఇలాంటి డ్రైవర్ల వల్లే రోడ్లపై అమాయకులు బలవుతున్నారు, డ్రైవింగ్ చేసేటప్పుడు కాస్త శ్రద్ధ పెట్టండి బాస్” అంటూ మరికొందరు హితవు పలుకుతున్నారు.
వాహనం నడిపేటప్పుడు ఏకాగ్రత ఎంత ముఖ్యమో ఈ ఘటన మనకు స్పష్టం చేస్తోంది. క్షణ కాలం పాటు మనసు అటుఇటు అయినా ప్రాణాలకే ముప్పు రావచ్చు. ఈ యువకుడు పెట్రోల్ బంకులో కాబట్టి సరిపోయింది, అదే రద్దీగా ఉండే రహదారిపై ఇలాంటి నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ఫలితం చాలా ఘోరంగా ఉండేదని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా ఈ ‘రైడర్’ చేసిన విన్యాసం మాత్రం ప్రస్తుతం నెట్టింట నవ్వులు పూయిస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..