Viral Video: ఆనంద్ మహేంద్ర మనసు దోచుకున్న టీ దుకాణం.. 45 ఏళ్లుగా మర్రి చెట్టు కిందే..

|

Jul 23, 2023 | 8:36 PM

అజిత్ సింగ్ కి చెందిన ఈ టీ దుకాణం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని 'గోల్డెన్ టెంపుల్' సమీపంలో ఉంది. అజిత్ సింగ్ కు కుటుంబం ఉన్నప్పటికీ 'బాబా'లా జీవిస్తున్నారు. తన షాపులో టీ తాగి ఎవరైనా డబ్బులు ఇస్తే ఆనందంగా తీసుకుంటారు. ఒక వేళ టీ తాగి డబ్బులు ఇవ్వకపోయినా పట్టించుకోరు. ఇదే విధంగా అజిత్ సింగ్ గత 45 ఏళ్లుగా నిరంతరంగా తన దుకాణాన్ని నడుపుతున్నారు.

Viral Video: ఆనంద్ మహేంద్ర మనసు దోచుకున్న టీ దుకాణం.. 45 ఏళ్లుగా మర్రి చెట్టు కిందే..
Viral Video
Follow us on

మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ చైర్మన్ , పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాకు ‘అజిత్ సింగ్’ టీ అంటే చాలా ఇష్టం. గత 45 సంవత్సరాలుగా 150 సంవత్సరాల పురాతనమైన మర్రి చెట్టు లోపల అజిత్ సింగ్ తన టీ స్టాల్‌ను నడుపుతున్నాడు. అజిత్ సింగ్ కి చెందిన ఈ టీ దుకాణం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని ‘గోల్డెన్ టెంపుల్’ సమీపంలో ఉంది. అజిత్ సింగ్ కు కుటుంబం ఉన్నప్పటికీ ‘బాబా’లా జీవిస్తున్నారు. తన షాపులో టీ తాగి ఎవరైనా డబ్బులు ఇస్తే ఆనందంగా తీసుకుంటారు. ఒక వేళ టీ తాగి డబ్బులు ఇవ్వకపోయినా పట్టించుకోరు. ఇదే విధంగా అజిత్ సింగ్ గత 45 ఏళ్లుగా నిరంతరంగా తన దుకాణాన్ని నడుపుతున్నారు.

ఆనంద్ మహీంద్రా ‘అజిత్ సింగ్’ అభిమాని..

ఇవి కూడా చదవండి

ఆనంద్ మహీంద్రా అజిత్ సింగ్ టీకి దుకాణానికి సంబంధించిన వీడియో షేర్ చేసారు. ఈ వీడియోతో పాటు ఉన్న క్యాప్షన్‌గా అజిత్ సింగ్ టీ దుకాణాన్ని ‘టెంపుల్ ఆఫ్ టీ సర్వీస్’గా అభివర్ణించారు. అమృత్‌సర్‌లో సందర్శించడానికి చాలా ప్రదేశాలు ఉన్నప్పటికీ.. తాను ఈ నగరంలో పర్యటిస్తే.. తప్పనిసరిగా గోల్డెన్ టెంపుల్‌ను సందర్శించడంతో పాటు ఈ ‘టెంపుల్ ఆఫ్ టీ సర్వీస్’ని సందర్శిస్తానని పేర్కొన్నాడు. ఈ బాబా 40 సంవత్సరాలకు పైగా దీనిని నడుపుతున్నారు. నిజానికి అతని హృదయం బహుశా అతి పెద్ద దేవాలయమని పేర్కొన్నారు ఆనంద్ మహీంద్రా.

అజిత్ సింగ్ దుకాణం

 

చిన్నారుల దాబా వైరల్‌ 

బాబా టీ స్టాల్ కు చెందిన వీడియోను ‘అమృత్‌సర్ వాకింగ్ టూర్స్’ అనే యూట్యూబ్ ఛానెల్ షేర్ చేసింది. సుమారు 1.5 సంవత్సరాల క్రితం.. ఇదే ఛానెల్ అమృత్‌సర్‌లోని ఒక దాబా వీడియో కూడా షేర్ చేసింది. ఇదే విషయాన్నీ ఆనంద్ మహీంద్రా తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో కూడా ప్రస్తావించారు. అనంతరం ఆ పిల్లల దాబా వీడియో వైరల్‌గా మారింది. దాబా వెలుపల జనం పోటెత్తారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..