
రైల్వే స్టేషన్ లోనో.. కదులుతున్న రైలు నుంచి దిగుతూనే లేదో ఎక్కుతూనే ఏదొక సందర్భంలో ప్రమాదాలకు గురవుతున్న ప్రయాణికులకు సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో దర్శనమిస్తాయి. అందుకనే ప్రయాణాలను హెచ్చరిస్తూ.. తరచుగా రైల్వే శాఖ సిబ్బంది ప్రకటనలు చేస్తూనే ఉంది. అయినప్పటికీ చాలామంది ప్రయాణీకులు.. త్వరగా గమ్యస్థానానికి చేరుకోవాలనే తొందరోనో.. లేదా.. కదిలే రైలునుంచి ఎక్కడం దిగడం ఓ సరదాగానో భావిస్తూ తమ ప్రాణాలతో తామే చెలగాటమాడుతూ ఉంటారు. ఇలాంటి ఘటనలకు సంబందించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటున్నాయి. తాజాగా రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కడానికి ప్లాట్ ఫామ్ మీద ఉన్న ఓ మహిళ ప్రాణాలను రైల్వే పోలీసు కాపాడిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
దేశ రాజధాని ఢిల్లీ మెట్రో రైల్వే స్టేషన్ లో శనివారం సాయంత్రం 5:46 గంటలకు అర్థాల మెట్రో స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. ప్లాట్ ఫామ్ మీద ఉన్న యువతిని హెచ్చరించానికి CISF ఇన్‌స్పెక్టర్ సంజీవ్ కుమార్ శర్మ ప్రయత్నించారు, అయితే రైలు రాకకోసం ఎదురుచూస్తున్న ఆ యువతి ఆ అధికారి మాటలను వినిపించుకోలేదు. వెంటనే అక్కడికి వెళ్లిన పోలీసు అధికారి ఆ మహిళను రైలు కింద పడకుండా.. ప్లాట్ ఫామ్ లోపలికి లాగి ఆమె ప్రాణాలను కాపాడారు. సంజీవ్ కుమార్ ప్రమాదాన్ని పసిగట్టి.. వేగంగా చర్య తీసుకున్నారు. ఆ యువతిని రక్షించడానికి ట్రాక్‌ల అంచు నుండి ప్లాట్‌ఫారమ్ వైపుకు లాగారు. ఇదే విషయాన్నీ పేర్కొంటూ రైల్వే సంస్థ ఓ వీడియో షేర్ చేసింది.
అనంతరం ఆ ప్రయాణీకురాలిని ఏదైనా సహాయం కావాలా అని అడిగారు.. ఆమె నిరాకరించింది.. తన ప్రాణాలను కాపాడినందుకు.. మెట్రోలో ఎక్కినందుకు CISF ఇన్స్పెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపింది.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..