Viral Video: అమ్మ కదా అంతే మరి.. ఓవైపు కుటుంబ పోషణ.. మరోవైపు బిడ్డపై కేరింగ్..

సృష్టిలో అమ్మ ప్రేమకు ఇలలో సాటి మరేదీ లేదు. తన పిల్లల ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అమ్మ ప్రేమని తెలిపే అనేక సంఘటనలకు సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమ్మ ప్రేమకి ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియో సజీవ సాక్ష్యం. అవును ఒక స్త్రీ.. తన ఒడిలో చిన్న బిడ్డన పెట్టుకుని ఆటో నడుపుతుంది. ఈ హృదయాన్ని హత్తుకునే వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. తల్లి ప్రేమకి త్యాగానికి ఇలలో సాటి వేరేదీ లేదని అంటున్నారు.

Viral Video: అమ్మ కదా అంతే మరి.. ఓవైపు కుటుంబ పోషణ.. మరోవైపు బిడ్డపై కేరింగ్..
Mothres Love

Updated on: Sep 18, 2025 | 1:11 PM

తల్లి ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. అమ్మ ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ.. త్యాగానికి ధర లేదు. తన పిల్లల కోసం ఎంతటి కష్టమైనా పడుతుంది.. ఏ సాహసానికైనా సిద్ధంగా ఉంటుంది. సమాజాన్ని సైతం ఎదురిస్తుంది. ఓ వైపు అమ్మగా పిల్లల కోసం ఎంత భాద్యతగా ఉంటుందో.. అదే సమయంలో కుటుంబ బాధ్యతని మోయడానికి కూడా వెనుకాడదు. అందుకు ఈ వీడియో నిదర్శనం. ఒక తల్లి తన బిడ్డను చేతుల మధ్య ఒడిలో పెట్టుకుని ఆటో నడుపుతోంది. ఈ భావోద్వేగ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తన బిడ్డ కోసం తల్లి పోరాటం

come-learndrivingskills అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయబడిన వీడియోలో ఒక మహిళ తన బిడ్డను ఒడిలో పెట్టుకుని.. గుండెకు అదుముకుని పిల్ల పడిపోకుండా జాగ్రత్త తీసుకుని ఆటో నడుపుతున్నట్లు కనిపిస్తుంది. ఆమె జీవనోపాధి కోసం ఆటో డ్రైవర్ గా మారినట్లు తెలుస్తోంది. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుంది. ట్రాఫిక్ మధ్యలో ఆటో ఆపి.. ఆమె బిడ్డను లాలిస్తోంది.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి.

ఈ వీడియో ఇప్పటివరకు తొమ్మిది లక్షలకు పైగా వ్యూస్ ని సొంతం చేసుకోగా.. వినియోగదారులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. “నేను వెయ్యి సార్లు ఆలోచించినా.. ఈ అమ్మ ప్రేమకు సరిపోయే ఒక్క పదమైనా నాకు దొరుకుతుందా? అని కామెంట్ చేశారు. మరొకరు “ఆమె సంసార యుద్ధానికి కృష్ణుడిలా మారింది.” ఈ ప్రపంచంలో ధర నిర్ణయించలేని ఏకైక ప్రేమ తల్లి ప్రేమ అని మరొకరు అన్నారు.

 

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..