పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అని పెద్దలు చెప్పిన విషయాన్నీ కొందరు చేసే వింత పనులతో గుర్తు చేసుకుంటూ ఉంటారు. తాజాగా ఓ యువతి తాను పిల్లిగా మారాలని కోరుకుంది. అందు కోసం ఏకంగా శరీరానికి రకరకాల ఆపరేషన్స్ చేయించుకుంటూ ఉంది. ఇటలీకి చెందిన 22 ఏళ్ల యువతి పేరు చియారా డెల్’అబేట్. ఆ యువతి పిల్లిగా మారాలని కోరుకుంది. న్యూయార్క్ పోస్ టిలో ఒక నివేదిక ప్రకారం ఇప్పటికే చియారా డెల్ పిల్లిలా మారడం కోసం ఏకంగా శరీరాన్ని 20 సార్లు ఆపరేషన్ చేయించుకుంది. సోషల్ మీడియాలో ఐడిన్ మోడ్ అనే పేరుతో తన వీడియోలను షేర్ చేసే ఈ యువతి.. టిక్‌టాక్‌లో ఇందుకు సంబంధించి అనేక వీడియోలను షేర్ చేసి.. మిలియన్ల వీక్షణలను సొంతం చేసుకుంది.
చియారా డెల్ 11 సంవత్సరాల వయస్సులో మొదటిసారిగా పిల్లిలా కనిపించుకోవడానికి ఆపరేషన్ చేయించుకోవడం మొదలు పెట్టింది. ప్రస్తుతం ఈ యువతి శరీరంపై దాదాపు 72 కుట్లు ఉన్నాయి. పిల్లిలా కనిపించడం కోసం చియారా చేసుకున్న శారీరక మార్పులలో భాగంగా అనేక కుట్లు వేయించుకుంది. ముక్కుకు రంధ్రాలు, నాలుకను చీల్చుకుంది. 0.8-సెంటీమీటర్ల మేర పెదవి కుట్లు, 1.6-సెంటీమీటర్ల లోపల కుట్లు వేయించుకుంది.
అయితే తాను చాలా కూల్ క్యాట్ లేడీ అవుతున్నాన అని 22 ఏళ్ల యువతి చెప్పింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ చేసిన వీడియోల్లో ఒకదానిలో ఆమె తన పెదవుల పైన ఉన్న రెండు ఖాళీ రంధ్రాల ద్వారా ఆమె చీలి పోయిన నాలుకను కదిలిస్తుంది.
ఇంకా స్త్రీ బ్లేఫరోప్లాస్టీకి కూడా చేయించుకుంది. ఇది ఎగువ లేదా దిగువ కనురెప్పలపై చేసే ఆపరేషన్. వాస్తవానికి ఈ ఆపరేషన్ “కనురెప్పల లోపాలు, వైకల్యాలు, వికృతీకరణలను సరిచేయించుకోవడానికి కంటి ప్రాంతం మరింత సౌందర్యంగా కనిపించేలా చేయడానికి నిర్వహిస్తారు.
నాలుగు కొమ్ములు, ఐబాల్ టాటూలు, సూదిలా నిటారుగా కనిపించేలా చెవులు, శాశ్వత ఐలైనర్, నుదిటి ఇంప్లాంట్లు, పంజా కోసం గోళ్లను ఆపరేషన్ తో చేయించుకుంది. పిల్లిలాగా మారడం కోసం ఆ యువతి ఏకమా తన చనుమొనలను కూడా తొలగించుకుంది.
తనకు పిల్లులంటే ప్రేమ అని పరిపూర్ణంగా నమ్ముతున్నానని.. అయితే పూర్తి స్థాయిలో పిల్లి రూపాన్ని సాధించడానికి ఇంకా చాలా సమయం ఉందని చెబుతుంది. కళ్లు, దంతాలు, ఎగువ పెదవి కట్ వంటి వాటిని శస్త్ర చికిత్స అవసరం అని పేర్కొంది.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..