Viral Video: అరే ఏంట్రా ఇది.. ఉన్నట్లుండి నదిలోంచి ఊడిపడ్డ రియల్ స్పైడర్ మ్యాన్.. ట్రైన్ ప్యాసింజర్‌కు సర్‌ప్రైజ్ షాక్ ఇచ్చాడు..!
Viral Video: రైళ్లో ప్రయాణికుల నుంచి దోచుకోవడం గురించి విని ఉంటారు. ట్రైన్ చైన్ లాగి మరీ ప్రయాణికులను నిలువుదోపిడీ చేసిన
Viral Video: రైళ్లో ప్రయాణికుల నుంచి దోచుకోవడం గురించి విని ఉంటారు. ట్రైన్ చైన్ లాగి మరీ ప్రయాణికులను నిలువుదోపిడీ చేసిన ఘటనలనూ చూసి ఉంటారు. మరి స్పీడ్‌గా వెళ్తున్న రైల్లో ఫుట్‌పాత్‌పై కూర్చున్న ప్రయాణికుల నుంచి బయటి వ్యక్తి దోచుకోవడం ఎప్పుడైనా చూశారా? పోనీ కనీసం విన్నారా? అయితే, ఇప్పుడు వినండి, చూసేయండి. అవును, ఆ దొంగ స్పైడర్ మ్యాన్‌గా మారిపోయాడు. వేగంగా వెళ్తున్న రైల్లో ప్రయాణికుల నుంచి ఫోన్ కొట్టేసి, ప్రయాణికులకు ఊహించని షాక్ ఇచ్చాడు. ఈ సర్‌ప్రైజ్ చోరీకి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఇంతకీ ఈ స్పైడర్ మ్యాన్ చోరీ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. బిహార్‌లో సినిమా స్టైల్లో చోరీ జరిగింది. సినిమాల్లో స్పైడర్ మాదిరిగా.. రియల్ స్పైడర్ మ్యాన్ ఈ షాకింగ్ దోపిడీకి పాల్పడ్డాడు. బీహార్‌లోని బెగుసరాయ్‌లో రైలు వంతెన దాటుతోంది. అయితే, రైలులో ప్రయాణిస్తున్న కొందరు యువకులు ఫుట్‌పాత్‌పై కూర్చున్నారు. రైలు నది వంతెనపై నుంచి వెళ్తుండగా.. వారు దానిని తమ సెల్ ఫోన్‌లలో వీడియో చిత్రీకరిస్తున్నారు. అయితే, ఆ సమయంలోనే ఊహించని షాక్ ఇచ్చాడు అనుకోని అతిథి. నదీ వంతెనపై ఓ చోట మాటు వేసి ఉన్న దొంగ.. వీరు వీడియో తీస్తున్న ఫోన్‌ను లటుక్కున క్యాచ్ పట్టేశాడు. రెప్పపాటులో జరిగిన ఈ చోరీతో బాధితుడు అయోమయానికి గురయ్యాడు. ఏం జరిగిందో అర్థం కాక బిత్తరపోయాడు. అయితే, అతని వెనుకే ఉన్న మరో వ్యక్తి కూడా ఫోన్‌లో నది వ్యూ ని వీడియో తీయగా.. ఈ చోరీ అంతా ఫోన్‌లో రికార్డ్ అయ్యింది. ఈ ఊహించని చోరీతో ప్రయాణికులంతా బిత్తరపోయారు. ఈ చోరీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది.
चोरों ने चलती ट्रेन से चोरों ने यात्री से छीना मोबाइल ट्रेन के फाटक पर बैठ कर एक यात्री अपने फोन से फोटोशूट कर रहा था, उसी दौरान चोरों ने यात्री का फोन छीन लिया, मामला बिहार के बेगुसराय का है pic.twitter.com/tOYq5SUwGt
— @StunnedVideo (@kumarayush084) June 9, 2022
ఈ చోరీ విధానం చూసి నెటిజన్లు సైతం షాక్ అవుతున్నారు. స్పీడ్ గా వెళ్తున్న రైలు నుంచి సెల్ ఫోన్‌ను కరెక్టుగా పట్టేయడమంటే అతనెంత చోరకళా నైపుణ్యం కలిగినవాడో అర్థం చేసుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో మరికొందరు అతన్ని రియల్ స్పైడర్ మ్యాన్‌గా పోలుస్తున్నారు. మరెందుకు ఆలస్యం.. ఈ షాకింగ్ చోరీ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.