Viral Post: ఇది ఒక తియ్యని వేడుక కాలం.. రూ. 14లకే కిలో గులాబ్‌ జామూన్‌.. మెను చూస్తేనే నోరూరుతోంది…!

|

Mar 01, 2023 | 3:39 PM

ఆ స్వీట్ షాపులో మోతీచూర్ లడ్డూ, రసగుల్లా, గులాబ్ జామూన్ తదితర మిఠాయిల ధర కిలో రూ. 10 నుండి 14 రూపాయలలోపే ఉంది. ఖరీదైన చాక్లెట్ బర్ఫీ, పిస్తా బర్ఫీ వంటి స్వీట్స్ కిలో ధర అత్యధికంగా రూ.18 నుంచి 20 వరకు పలుకుతోంది.. ఇంతకీ ఎక్కడంటే..

Viral Post: ఇది ఒక తియ్యని వేడుక కాలం.. రూ. 14లకే కిలో గులాబ్‌ జామూన్‌.. మెను చూస్తేనే నోరూరుతోంది...!
Sweets
Follow us on

ఒకప్పటి మిఠాయి దుకాణం ధరల పట్టిక ఒకటి తాజాగా సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఫేస్‌బుక్‌లో  పోస్ట్ చేసిన మెనూ ఒకటి నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఈ పోస్ట్‌కు సంబంధించిన ఫోటో ప్రకారం.. దాదాపు 30-40 ఏళ్ల క్రితం వెనక్కి తిరిగి చూసుకుంటే మనం నిత్యజీవితంలో తినే, ఉపయోగించే వస్తువుల ధరలు చాలా తక్కువగా ఉండేవని తెలుస్తుంది..  అప్పటి ధరలను చూస్తే మీ కళ్లు భైర్లు కమ్మేయటం ఖాయమనే చెప్పాలి. పాత ఫ్యాషన్ డెజర్ట్ మెనూకి సంబంధించిన ఇలాంటి పోస్ట్ ఫేస్‌బుక్‌లో వైరల్‌గా మారింది. 4 దశాబ్దాల క్రితం నాటి స్వీట్ షాప్ మెనూ కార్డ్‌ని ఫేస్‌బుక్ పేజీ గాగ్రెట్ హల్చల్‌లో పోస్ట్ చేశారు. నేటి ప్రమాణాలతో పోలిస్తే అప్పటి ఆహార ధర చాలా తక్కువగా ఉంది. ఈ వైరల్ పోస్ట్‌కి నెటిజన్ల నుండి రకరకాల రెస్పాన్స్ వస్తోంది.

జలంధర్ కంటోన్మెంట్, హార్ద్యల్ రోడ్‌లోని లవ్లీ స్వీట్ హౌస్ ఒకప్పటి డెజర్ట్ మెనూ ఫోటోను పోస్ట్‌ షేర్‌ చేశారు. 1980 నాటి ఫేమస్ లవ్లీ స్వీట్ ధరల జాబితా ప్రకారం మోతీచూర్ లడ్డూ, రసగుల్లా, గులాబ్ జామూన్ తదితర మిఠాయిల ధర కిలో రూ. 10 నుండి 14 రూపాయలలోపే ఉందని తెలిసింది. ఈరోజు మనకు ఇంత తక్కువ ధరకు మిఠాయి ముక్క కూడా లభించదు. చాక్లెట్ బర్ఫీ, పిస్తా బర్ఫీ వంటి స్వీట్స్ కిలో ధర అత్యధికంగా రూ.18 నుంచి 20 వరకు పలికింది. సమోసా, కచోరీ, పనీర్ పకోడా వంటి చిరుతిళ్ల ధర ఆ రోజుల్లో 1 రూపాయి కంటే తక్కువే. నేడు అవే చిరుతిళ్ల ధర రూ.10 నుంచి రూ.100 వరకు ఉంది. వైరల్ మెనూ పట్ల నెటిజన్లు సహజంగానే ఆకర్షితులవుతున్నారు. ఈ వైరల్ పోస్ట్‌పై నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ పోస్ట్‌ చూస్తుంటే అప్పటి రోజులు ఇక ఎప్పటికీ తిరిగి రాలేవంటూ ఒక వినియోగదారు అన్నారు. మరొక వినియోగదారు ఈ దుకాణంలో స్వీట్లను ఇష్టపడుతున్నారు. ఇప్పుడు నిజంగా మిస్ అవుతున్నాను అని చెప్పారు.. పంజాబ్‌లోని ఉత్తమ స్వీట్ షాపుల్లో ఇదొకటి అని మరొక వినియోగదారు చెప్పారు. నేను 1996-2000లో జలంధర్‌లో ఉన్నప్పుడు క్రమం తప్పకుండా ఈ స్వీట్ షాప్‌కి వెళ్లేవాడినంటూ తమ జ్ఞాపకాలను షేర్‌ చేసుకున్నారు. ఈ పోస్ట్‌కి ఇప్పటివరకు 28,000 లైక్‌లు, 1,600 కామెంట్‌లు వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి