ఎవరినైనా మీరు వేసుకున్న జీన్స్ ప్యాంట్ ధర ఎంత అని అడిగితే .. బ్రాండ్ ని బట్టి ధర అంటూ.. రూ. 2000, రూ.4000 లేదా మరీ రేర్ బ్రాండ్ అయితే రూ. 10000లని చెబుతారు. అయితే ప్రస్తుతం లక్షల రూపాయల కాస్ట్ ఉన్న జీన్స్ కూడా మార్కెట్‌లో దొరుకుతుంది. కానీ ఇంత కాస్టిలీ జీన్స్ ను ధరించేవారు సెలబ్రెటీలు.. కోట్లను సంపాదించే వ్యక్తులు అయి ఉంటారు. సర్వ సాధారణంగా 10 వేల రూపాయల జీన్స్‌ను కొంటేనే చాలా ఎక్కువ ధరకు జీన్స్ ప్యాంట్ కొన్నామని భావిస్తారు.. అయితే ఇప్పుడు ఒక జీన్స్ ను లక్షా రెండు లక్షలకు కాదు.. దాదాపు కోటి రూపాయలకు చెరువులో డబ్బులు చెల్లించి సొంతం చేసుకున్నారు. అదేంటి జీన్స్ ను కొనడానికి లక్షలు వెచ్చించడమేంటి? .. ఏమైనా సరికొత్త జీన్స్.. కొత్త బ్రాండెడ్ జీన్స్ అని అనుకుంటున్నారా.. అయితే పప్పులో కాలు వేసినట్లే.. ఎందుకంటే ఇది పాత జీన్స్ ప్యాంట్ .. ప్రస్తుతం ఈ గురించి పాత జీన్స్ ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఈ జీన్స్ లక్ష-రెండు లక్షలకు కాదు దాదాపు రూ. 94 లక్షలకు అమ్ముడయింది. అవును, ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం.. ఇది పూర్తిగా నిజం. విషయం మొత్తం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన తెల్లటి రంగులో ఉన్న జీన్స్ USAలోని నార్త్ కరోలినాలోని ఓడ శిథిలాల్లో దొరికింది. నివేదికల ప్రకారం, 1857లో ఓడ మునిగిపోయింది. ఈ జీన్స్ ను అదే ఓడకి చెందిన శిథిలాల నుండి కనుగొన్నారు. అంటే ఇప్పుడు ఈ జీన్స్‌కు సుమారు 165 ఏళ్లు. అలాంటి పరిస్థితిలో వేలం వేయగా వేలంలో దాదాపు 94 లక్షల రూపాయలు (US$114,000) వచ్చాయి.
ఈ జీన్స్‌ను ఏ కంపెనీ తయారు చేసిందంటే..
అయితే ఈ చారిత్రాత్మక జీన్స్‌ను ఎవరు తయారు చేశారనే దానిపై ఇంకా గందరగోళం నెలకొంది. ఈ జీన్స్‌లు లెవీ స్ట్రాస్ & కో కంపెనీ తయారు చేసింది కావచ్చని కొందరు అంటున్నారు. అయితే అధికారికంగా.. ఈ కంపెనీ 1873 సంవత్సరంలో తన మొదటి జీన్స్‌ను తయారు చేసింది. మరికొందరు ఈ ఏ కంపెనీ జీన్స్ అంటే.. అప్పట్లో లెవీ స్ట్రాస్ కంపెనీ డ్రై గూడ్స్ అనే హోల్‌సేల్ కంపెనీ ఉండేదని.. ఇప్పుడు ఓడలోని ‘చెత్త కుప్ప’లో దొరికిన ఈ జీన్స్.. ఆ కంపెనీకి చెందినది కావచ్చని.. జీన్స్ ప్యాంటు ప్రపంచంలో తొలి వెర్షన్ కావచ్చని కొందరు అంటున్నారు. ఇప్పుడు మార్కెట్లో లభించే జీన్స్ కు ఇదే మాతృక వంటిది అని భావిస్తున్నారు.
1857లో మునిగిపోయిన ఓడ:
ఈ చారిత్రాత్మక జీన్స్‌ను ఎవరు తయారు చేశారనే దాని గురించి ఇప్పుడు ఖచ్చితమైన సమాచారం లేదు. అయితే ఇది సెప్టెంబర్ 12, 1857 కంటే ముందు తయారు చేయబడిందని ఖచ్చితంగా చెబుతున్నారు. ఎందుకంటే ఈ జీన్స్ కనుగొనబడిన ఓడ శిధిలాలే దీనికి ఆధారం. ఈ ఓడ1857లో సముద్రంలో తుఫాను కారణంగా సెప్టెంబర్ 12 న మునిగిపోయింది. అప్పుడు ఈ నౌక అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి పనామా మీదుగా న్యూయార్క్‌కు వెళ్తోంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..