పిచ్చి పలు విధాలు.. స్లిమ్‌గా ఉండాలని 14 లక్షల ఖర్చు చేసి మరీ ఎముకలను తొలగించుకున్న యువతి..

|

Jan 12, 2025 | 8:19 PM

ఇప్పటి జనరేషన్ వారు అందం అంటే బాడీ స్లిమ్​గా, చర్మం తెల్లగా మెరుస్తూ యూత్​ఫుల్​లుక్​తో ఉండడం అని అనుకుంటున్నారు. అందుకనే స్లిమ్ గా మార్చుకోవడానికి ఏదైనా చేస్తున్నారు. అయితే ఒక యువతి అందంగా ఉండడం కోసం చేసిన పని తెలుసుకుని జనం షాక్ తింటున్నారు. ఒక యువతి తనని తాను స్లిమ్‌గా మార్చుకోవడానికి నాలుగు పక్కటెముకలను తొలగించుకుంది. ఈ సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది.

పిచ్చి పలు విధాలు.. స్లిమ్‌గా ఉండాలని  14 లక్షల ఖర్చు చేసి మరీ ఎముకలను తొలగించుకున్న యువతి..
Us Influencer
Follow us on

లోకో భిన్న రుచిః అన్నారు పెద్దలు. కొంత మంది అభిరుచి గురించి తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యపోతారు. అలాంటి కథ ఒకటి ప్రస్తుతం ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఓ యువతి స్లిమ్ గా కనిపించేందుకు తన నడుము నుంచి నాలుగు పక్కటెముకలను తొలగించుకుంది. తద్వారా ఆమె మరింత అందంగా.. స్లిమ్‌గా కనిపిస్తుంది. అయితే ఆమె అభిరుచి ఇక్కడితో ముగియలేదు. ఆమె ఇప్పుడు ఆ పక్కటెముకల నుంచి తన కోసం ఒక కిరీటం తయారు చేయించుకోనుంది.

అమెరికాలోని కాన్సాస్ సిటీలో నివసిస్తున్న 27 ఏళ్ల ఎమిలీ జేమ్స్ అనే ట్రాన్స్ గర్ల్ తన భిన్నమైన కోరిక, హాబీతో వార్తల్లో నిలుస్తోంది. గతంలో కంటే సన్నగా కనిపించాలని తన కోరికను తెలియజేస్తూ ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీని కారణంగా తాను తన పక్కటెముకలను తొలగించుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. దీని కోసం తాను లక్షల రూపాయలు ఖర్చు చేశానని చెప్పింది. అంతేకాదు తొలగించిన పక్కటెముకలతో ఇప్పుడు తన కోసం ఒక కిరీటాన్ని తయారు చేయించుకోవాలనుకుంటున్నట్లు పేర్కొంది.

పక్కటెముకలతో కిరీటం చేయండి ప్లీజ్

ఇవి కూడా చదవండి

మీడియా కథనాల ప్రకారం ఆమె 17,000 డాలర్లు (రూ. 14 లక్షల కంటే ఎక్కువ) ఖర్చు చేసి మరీ ఆపరేషన్ చేయించుకుని నాలుగు పక్కటెముకలను తొలగించుకుంది. ఆ తర్వాత తన పక్కటెముకను ఇవ్వమని డాక్టర్‌ని అభ్యర్థించింది. వాటిని తీసుకున్న ఆమె కిరీటం చేయించాలని భావిస్తోంది. ఆ కిరీటాన్ని తన బెస్ట్ ఫ్రెండ్‌కి బహుమతిగా ఇవ్వాలని కోరుకుంటుంది. ఎమిలీ తన ప్రక్రియ గురించి పూర్తి సమాచారాన్ని సోషల్ మీడియాలో ఇచ్చింది.

ఈ క‌థ వెలుగులోకి వ‌చ్చిన త‌ర్వాత నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. చాలా మంది నెటిజన్లు ఈ వీడియోపై వ్యాఖ్యానిస్తూ.. ఆ పక్కటెముకలను ఉడికించి తినమంటూ కామెంట్ చేశారు. అయితే ఆమె తన డబ్బు, తన శరీరం.. తనకు ఇష్టమైనట్లు చేసుకుంటా అని సమాధానమిచ్చింది. తన గురించి ఇతరులకు మాట్లాడే హక్కు లేదని చెబుతోంది.

 

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..